తులసి నీళ్లను రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Oct 16, 2024, 11:20 AM IST

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది మత విశ్వాసానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే మీరెన్ని రోగాలకు దూరంగా ఉంటారో తెలుసా? 

దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని పవిత్రమైన మొక్కగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. అయితే ఈ మొక్క మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

ఇది ఎన్నోఔషధ గుణాలున్న మొక్క. తులసి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. 
 

అయితే తులసిని ఎన్నో విధాలుగా తినొచ్చు. టీలో ఈ ఆకులను వేసి మరిగించి లేదా పరిగడుపున ఈ ఆకులను నమిలి తినొచ్చు. అయినప్పటికీ రోజూ తులసి ఆకుల నీళ్లను తాగితే మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. అసలు తులసి ఆకుల నీళ్లను రోజూ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తులసి నీళ్లను ఎలా తయారుచేయాలి? 

ముందుగా తులసి ఆకులను శుభ్రంగా కడగండి. ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లను పోసి మరిగించండి.ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లో తులసి ఆకులను వేయండి.  తర్వాత 5-10 నిమిషాల పాటు మరిగించి స్టవ్  ఆఫ్ చేయండి. దీన్ని వడకండి తాగండి. కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా తేనెను కూడా వేసుకుని తాగొచ్చు. 
 

Latest Videos


రోజూ తులసి నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

తులసి వాటర్ లోయాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం సంక్రమణతో పోరాడటానికి బాగా సహాయపడతాయి. మీరు రోజూ తులసి నీళ్లను తాగితే దగ్గు, జలుబు,  గొంతు నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. 

డిటాక్స్ 

ఉదయాన్నే పరిగడుపున తులసి వాటర్ ను తాగితే మీ శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే మీ శరీరాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యం

తులసి వాటర్ లో పుష్కలంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ నీళ్లను మీరు రోజూ తాగితే మీకు గుండెపోటు, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

తులసి నీళ్లను తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అంటే ఈ వాటర్ ను తాగితే గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ ఈ వాటర్ ను తాగితే మీ పొట్టకు మంచి మేలు జరుగుతుంది. 

ఒత్తిడిని తగ్గిస్తుంది

తులసిని అడాప్టోజెన్ కూడా భావిస్తారు. అంటే ఇది మీ ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ ను రోజూ తాగితే మీ శరీరంతో పాటుగా మీ మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది. 
 

చర్మానికి మేలు చేస్తుంది

తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు వంటి చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడానికి బాగా సహాయపడతాయి. ఈ వాటర్ ను రోజూ తాగితే మీ చర్మం కాంతివంతంగా, యవ్వనంగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. 
 

click me!