వానకాలంలో వేడి వేడిగా అల్లం టీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

Published : Jul 10, 2023, 07:15 AM IST

వర్షాకాలంలో అల్లం టీ మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం టీని మసాలా చాయ్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ సీజన్ లో మసాలా టీని తాగితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.   

PREV
16
 వానకాలంలో వేడి వేడిగా అల్లం టీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
ginger tea

అల్లం టీ రుచి అద్బుతంగా ఉంటుంది. దీని వాసనకే నోట్లో లాలాజలం ఊరుతుంది. నిజానికి ఈ టీ మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లం టీలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వర్షాకాలంలో అల్లం టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

రోగనిరోధక శక్తి

అల్లంలో మన రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం టీని తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాల నుంచి ఈ టీ మనల్ని రక్షిస్తుంది. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. 
 

36

జీర్ణక్రియ

వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే అల్లం టీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ అల్లం టీ కడుపు ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. అలాగే గట్ లో మంటను తగ్గిస్తుంది. పోషక శోషణకు కూడా సహాయపడుతుంది.
 

46

శరీరాన్ని వేడెక్కిస్తుంది

వర్షాకాలంలో ఉష్ణోగ్రత తగ్గి గాలిలో తేమ పెరుగుతుంది. ఇది మనల్ని చల్లగా చేస్తుంది. ఇలాంటి సమయంలో అల్లం టీని తాగితే మన శరీరం లోపలి నుంచి వేడెక్కుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. అల్లం టీ వర్షాకాలంలో మిమ్మల్ని ఆహ్లాదంగా ఉంచుతుంది.
 

56

యాంటీ ఇన్ఫ్లమేషన్

అల్లంలో జింజెరోల్స్ అని పిలువబడే శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పులు వంటి మంట సంబంధిత సమస్యలు వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి. అయితే అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. నొప్పి కూడా క్రమంగా తగ్గుతుంది. అలాగే మెరుగ్గా నడవగలుగుతారు. 
 

66
Image: Freepik

శ్వాసకోశ లక్షణాల నుంచి ఉపశమనం

వర్షాకాలం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలెర్జీల ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం టీ లోని వేడిచేసే గుణాలు శ్లేష్మాన్ని సడలించే సామర్థ్యం దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories