ఈ సీజన్ లో శానిటరీ ప్యాడ్స్ కంటే మెన్స్ట్రువల్ కప్పులే బెటర్.. ఎందుకంటే?

Published : Jul 09, 2023, 11:59 AM IST

వర్షాకాలంలో పీరియడ్స్ టైంలో చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో తేమ వల్ల సంక్రమణ ప్రమాదం మరింత పెరుగుతుంది.   

PREV
17
ఈ సీజన్ లో శానిటరీ ప్యాడ్స్ కంటే మెన్స్ట్రువల్ కప్పులే బెటర్.. ఎందుకంటే?

వర్షాకాలంలో బట్టలు కూడా సరిగ్గా ఎండవు. బట్టల్లో తేమ ఉంటే ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు పెరుగుతాయి. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. ముఖ్యంగా పీరియడ్ సమయంలో .. బట్టలు ఆరబెట్టకపోవడం, వాతావరణంలో తేమ, పీరియడ్ లో ప్యాడ్ తేమ వంటివన్నీ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి. వర్షాకాలంలో ప్యాడ్లకు బదులుగా మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగిస్తేనే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. 

27

ఎందుకంటే ఈ కప్పుల్లో ఎలాంటి తడి ఉండదు. కాబట్టి రక్తం బయటకు వెళ్లకుండా యోని లోపల దీన్ని పెడతారు. ఈ కప్పులను పెట్టుకుని స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటివన్నీ చేయొచ్చు. వర్షాకాలంలో మెన్స్ట్రువల్ కప్పులు కూడా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఇది తేమ, సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

37

మెన్స్ట్రువల్ కప్పులను సిలికాన్ తో తయారుచేస్తారు. అలాగే వర్షాకాలంలో యోని లోపలి భాగానికి గాలి తగలదు. ప్యాడ్లు, టాంపోన్లలో తేమ చాలా త్వరగా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. పీరియడ్ ప్యాంటీ కూడా వర్షాకాలంలో ఆరబెట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వర్షాకాలంలో వీటిని యూజ్ చేయడం అంత మంచిది కాదు.  వర్షాకాలంలో శానిటరీ ప్యాడ్స్ కంటే మెన్స్ట్రువల్ కప్పులే ఎందుకు మంచివో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

47
menstrual cups are safe

లీకేజీల ప్రమాదం తక్కువ 

వర్షాకాలంలో ఎప్పుడైనా వర్షం పడొచ్చు. నీరు నిలిచిపోవచ్చు. ఇది శానిటరీ ప్యాడ్ల లీకేజీకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. వర్షపు నీరు లేదా తేమ కారణంగా ఈ ప్యాడ్లు తడిసిపోతాయి. ఇది లీకేజీ, అసౌకర్యానికి దారితీస్తుంది. మెన్స్ట్రువల్ కప్పులు యోని లోపల బిగ్గరగా పట్టుకుని ఉంటాయి. అలాగే లీకేజీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెడికల్-గ్రేడ్ సిలికాన్ లేదా లేటెక్స్ తో తయారైన మెన్స్ట్రువల్ కప్పులు తగినంత మొత్తంలో ద్రవాన్ని నిల్వ చేస్తాయి. దీంతో లీకేజీ అవయ్యే అవకాశమే ఉండదు. 

57
menstrual cup

సౌకర్యం

రుతుపవనాలు తేమను పెంచుతాయి. భారీ శానిటరీ ప్యాడ్లను ధరించడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కానీ మెన్స్ట్రువల్ కప్పులు అలా కాదు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఒకసారి వీటిని పెట్టుకున్న తర్వాత అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపించదు. అసౌకర్యం, లీకేజీ వంటి సమస్యలే ఉండవు. దీనివల్ల మహిళలు స్వేచ్ఛగా తిరగడానికి, వివిధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇవి సహాయపడతాయి. 
 

67
menstrual cup

పదేపదే మార్చడం

శానిటరీ ఉత్పత్తులను తరచుగా మార్చాల్సి ఉంటుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ మెన్స్ట్రువల్ కప్పులు అలా కాదు. వీటిని తరచుగా మార్చాల్సిన ప్యాడ్ల మాదిరిగా కాకుండా బ్లీడింగ్ తీవ్రతను బట్టి మార్చాల్సి ఉంటుంది. వీటిని 12 గంటల వరకు ధరించొచ్చు.

77
menstrual cup

పరిశుభ్రంగా, మెయింటైన్ చేయడం సులభం

సంక్రమణను నివారించడానికి వర్షాకాలంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మెన్స్ట్రువల్ కప్పులను సులభంగా శుభ్రపరచొచ్చు.  కప్పును ఖాళీ చేసిన తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడగొచ్చు. అంతేకాదు మెన్స్ట్రువల్ కప్పులు పునర్వినియోగపరచదగినవి. వీటిని సరిగ్గా చూసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇది సింగిల్-యూజ్ శానిటరీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories