skin care: చలికాలంలో చన్నీటి స్నానం.. ఎంత లాభమో..!

First Published Nov 9, 2021, 3:43 PM IST

ఈ శీతాకాలంలో చల్లటి నీరు ఒక్కసారి శరీరంపై పోసుకుంటే.. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే.. అలా అనిపించడం వల్ల  శ్వాసక్రియ రేటు కూడా పెరిగే అవకాశం ఉందట. 


Winter మొదలైంది. రోజు రోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో అందరూ.. వెచ్చగా ఉండే దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి ఈ చలికాలంలో.. చన్నీటి స్నానం చేయడం అంటే.. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతోందా..? దాదాపు అందరూ చలికాలం రాగానే వేడి వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం. కానీ.. నిజానికి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మనకు ఊహించని లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


చల్లని నీటితో స్నానం చేయడం వల్ల  శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సరిగా జరుగుతుందట. దాని వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా.. గుండెకు కూడా రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుందట. అంతేకాకుండా.. రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట.
 

ఈ శీతాకాలంలో చల్లటి నీరు ఒక్కసారి శరీరంపై పోసుకుంటే.. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే.. అలా అనిపించడం వల్ల  శ్వాసక్రియ రేటు కూడా పెరిగే అవకాశం ఉందట. దాంతో ఆక్సీజన్ ఎక్కువగా పీల్చుకుంటాం. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరిగి.. శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో రోజంతంటికీ శక్తి లభిస్తుంది.
 

ఇక వ్యాయామాలు చేసి అసలిపోయిన తర్వాత కొద్దిగా కండరాల నొప్పి బాధిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కండరాలపై చల్లటి నీరు పోయడం వల్ల.. ఉపశమనం లభిస్తుందట.
 

ఇక చర్మం అందంగా ఉండాలి అనుకునేవారు కూడా.. చన్నీటి స్నానమే  చేయాలట. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చేసిన ఆ కాసేపు హాయిగా ఉంటుందన్న మాట నిజమే కానీ.. ఆ తర్వాత చర్మం పొడిపారడం లాంటివి జరుగుతాయి. అదే చన్నీటితో చేస్తే.. ఆ సమస్యలు ఉండవు. కాబట్టి.. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మాన్ని అందంగా ఉంచుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇక.. ఈ రోజుల్లో ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆ జాబితాలో మీరు కూడా ఉంటే..రోజూ చన్నీటితో స్నానం చేయండి. చన్నీటితో స్నానం చేయడం వల్ల ఈ ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

click me!