తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ!

First Published Oct 19, 2021, 9:20 PM IST

మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే  నీరు (Water) అవసరం. జీవనానికి నీరే మూలం. ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. కానీ కొందరు తమ బిజీ లైఫ్ లో పడి నీటిని తీసుకొనుటలో నిర్లక్ష్యం చేస్తుంటారు.

మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే  నీరు (Water) అవసరం. జీవనానికి నీరే మూలం. ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. కానీ కొందరు తమ బిజీ లైఫ్ లో పడి నీటిని తీసుకొనుటలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు (Health Problems) వస్తాయి. అవేంటో చూద్దాం.
 

శరీరానికి సరిపడా నీరు అందకుంటే ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశముంది. ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల (Two litres) నీటిని తాగాలి. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిగతా సమయం లోనూ అప్పుడప్పుడూ మాములు నీటిని (Normal Water) తీసుకోవాలి.
 

తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ (Dehydration) బారిన పడి చర్మ సమస్యలు వస్తాయి. చర్మంపై ముడుతలు, మచ్చలు, అలర్జీ (Wrinkles, Spots, Allergy) సమస్యలు వస్తాయి. తగిన నీరు తాగకుంటే తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
 

జీర్ణవ్యవస్థ (Digestive system) దెబ్బతింటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి ఇబ్బందులు కలుగుతాయి. మలబద్దక (Constipation) సమస్యలు వస్తాయి. శరీర అవయవాల పనితీరు సరిగా ఉండదు. శరీరానికి తగిన నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి మేలుంటుంది.
 

తక్కువ నీరు తీసుకుంటే మూత్ర విసర్జన (Urination) పనితీరు సరిగా ఉండదు. మూత్రంలో మంట (Inflammation) ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నీటిని ప్రతిసారి బాగా తాగుతుండాలి.
 

శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల గుండె సంబంధ (Cardiac) సమస్యలు వచ్చే ప్రమాదముంది. శరీరంలో తగినంత నీరు లేకుంటే రక్తం చిక్కబడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ (Cholesterol) పెరిగి గుండె జబ్బులు రావచ్చు.
 

శరీరానికి కావాల్సిన నీరు అందించడం వల్ల చర్మం కాంతివంతంగా (Brightly) ఉంటుంది. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. శరీర అలసటను (Fatigue) తగ్గిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటాం. మూత్రవిసర్జన వ్యవస్థ సరిగా పని చేస్తుంది.

click me!