ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటే ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే అలాంటి సమస్యలు!

Published : Sep 20, 2022, 04:40 PM IST

ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ఎక్కువ మొత్తంలో ఆయిల్ ను కూడా ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటాము.  

PREV
15
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటే ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే అలాంటి సమస్యలు!

ఎక్కువ భాగం ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.. అవి ఏంటంటే.. ప్రస్తుత కాలంలో మనకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లలో భాగంగా ఎక్కువ శాతం మంది ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
 

25

ఈ విధంగా అధిక మొత్తంలో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల అధిక శరీర బరువు పెరగడం జీర్ణక్రియ సమస్యలు తలెత్తడం వంటి ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ మనపై చూపకుండా ఉండాలంటే ఆహారం తీసుకున్న తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.
 

35

మనం ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత హెవీగా అనిపిస్తూ చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు అయితే పొరపాటున కూడా ఇలా విశ్రాంతి తీసుకోకూడదు.హెవీ ఫుడ్ తీసుకున్న లేదా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న భోజనం చేసిన తర్వాత ఓ అరగంట పాటు మెల్లిగా వాకింగ్ చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణమయి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా వాకింగ్ చేయకుండా నిద్రపోవటం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఎన్నో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడతాయి.
 

45

ముఖ్యంగా మనం ఆహారం తీసుకున్న వెంటనే సరైన మోతాదులో నీటిని తాగాలి ఇలా నీటిని తాగినప్పుడే మనం తీసుకున్న ఆహారం జీర్ణ క్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. అలాకాకుండా నీటిని తక్కువ మోతాదులో తాగినప్పుడు చిన్నప్రేగు ఆహారంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని జీర్ణక్రియకు ఉపయోగించడం వల్ల మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇలా మలబద్ధక సమస్య ఏర్పడకుండా ఉండాలంటే ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తరువాత ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం ఎంతో మంచిది.
 

55

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత 30 నిమిషాలు నడకతో పాటు అధిక నీరు తీసుకోవడం అలాగే నీటి శాతం, ఫైబర్ అధికంగా కలిగినటువంటి పండ్లను తీసుకోవడం కూడా ఎంతో మంచిది.ఇలా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ ప్రక్రియలను నిర్వహించడానికి అవసరమైన విటమిన్లను ఖనిజాలను అందించడంలో పండ్లు దోహదపడతాయి. ఈ విధంగా ఆయిల్ ఫుడ్ తిన్నవారు భోజనం చేసిన తర్వాత ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవకుండా అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories