Health Tips: నెలసరిలో వచ్చే నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!

First Published | Sep 12, 2023, 12:45 PM IST

Health Tips: ఆడవాళ్ళకి పీరియడ్స్ టైం అనేది ఎంతో ఇబ్బందికి గురిచేస్తుంది. ఆ సమయంలో వారు కాస్త నీరసంగా చికాకుగా అలాగే చాలామంది కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆహారం తీసుకోవడం ద్వారా ఆ ఇబ్బందులని అధిగమించవచ్చు.ఆ ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

 ఆడవారిలో రుతుస్రావం మొదలైన వెంటనే చాలా మందికి కడుపునొప్పి, నడుము నొప్పి,అలసట వంటివి ఏర్పడతాయి. వీటి వలన చికాకు, కోపం, ఆందోళన వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
 

 ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. చేపలు, మాంసం గుడ్లు, ఖర్జూరాలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. పీరియడ్స్ సమయంలో కొన్ని పండ్లను, కాయలను కూడా తినడం ఎంతో మంచిది.
 

Latest Videos


 అవి కూడా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆపిల్, కీరదోసగాయ, పుచ్చకాయ వంటివి తినడం వలన మరింత మెరుగైన ఫలితాలని ఇస్తాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన పీరియడ్స్ టైం లో వచ్చే కడుపునొప్పి, నడుము నొప్పి వంటి బాధలనుంచి ఉపశమనం పొందవచ్చు.
 

అలాగే వాముని నీటిలో కాచి తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ఒక కప్పు అల్లం టీ తాగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది. అలాగే ఐరన్ లోపం నివారించడం కోసం డార్క్ చాక్లెట్ ఎంతో ఉపయోగపడుతుంది.
 

 డార్క్ చాక్లెట్ లో ఐరన్,మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.  అలాగే పీరియడ్స్ టైం లో నీరు ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే రుతుస్రావంలో  రక్తంతో పాటు నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండటం కోసం నీటిని తాగాలి. అలాగే ఫ్రూట్ జ్యూస్ లు తాగటం వలన కూడా శరీరానికి శక్తి వస్తుంది.

 అలాగే ఆకుకూరలు తినటం వల్ల కూడా పీరియడ్స్ వల్ల వచ్చే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ టైం లోనే కాకుండా రెగ్యులర్ గా కూడా ఇలాంటి ఆహార విధానాన్ని పాటించడం వలన పీరియడ్స్ టైం లో వచ్చే బాధలు తగ్గు ముఖం పడతాయి.

click me!