ప్రస్తుతం కీటో డైట్ బాగా ట్రెండ్ అవుతోంది. బరువు తగ్గడానికని చాలా మంది ఈ డైట్ ను ఫాలో అవుతున్నారు. కీటో డైట్ అనేది మీరు తినే విధానం, ఎక్కువ మొత్తంలో కొవ్వు, సమతుల్య ప్రోటీన్, చాలా తక్కువ లేదా కార్బోహైడ్రేట్లు మొత్తమే ఉండవు. కీటో డైట్ లో మటన్, జున్ను, గుడ్డు, చికెన్, కాయలు, సీఫుడ్, విత్తనాలు ఉంటాయి. అయితే క్యాన్సర్, ఓవరీ సిండ్రోమ్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేసుకోవడానికి కూడా కీటో డైట్ ను ఉపయోగిస్తారు. కానీ కీటో డైట్ మనం అనుకున్నంత ఆరోగ్యకరమైంది కాదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎక్కువ కాలం పాటించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.