మనలో చాలా మంది బిజీ లైఫ్ వల్ల తీరిక లేకుండా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే రాత్రింబవళ్లు కూడా కష్టపడుతుంటారు. ఇలాంటి వారికి సమయానికి తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండదు. కానీ తీరిక లేని పనుల వల్ల మీ శరీరం బాగా అసలసిపోతుంది.
fatigue
మీకు తెలుసా? కంటినిండా నిద్రపోకుండా, సరిగ్గా తినకుండా గంటల తరబడి పనిచేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో హాస్పటల్ కు వెళ్లపోతే మీకు దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది.
ప్రస్తుత కాలంలో యువత, ఆడవారు ఎక్కువగా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో ఇనుము లోపం వల్ల అలసటతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల ఉదయం లేవగానే శరీరం అలసిపోయి కణాల్లో ఆక్సిజన్ లోపిస్తుంది. దీంతో పాటుగా శ్వాస సరిగా అందదు.
Fatigue
ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే ముందుగా డాక్టర్ దగ్గకు వెళ్లి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోండి. పోషకాహారాన్నిరోజూ తినండి. ప్రతిరోజూ అలసట, మైకము వంటి సమస్యలు ఉంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు వంటి సమస్యలు కూడా రావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
Fatigue
రక్తంలో ఇనుము స్థాయిని పెంచడానికి ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని రెగ్యులర్ గా తినండి. చేపలు, మాంసం, గుడ్లలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని క్రమం తప్పకుండా తినండి. అలాగే పాలకూరను కూడా రోజూ తినండి. ఇవి మీలో ఇనుము లోపాన్ని పోగొడుతాయి. ఇనుము లోపం ఆడవారికే ఎక్కువగా ఉంటుంది.