బక్కగా ఉన్నవాళ్లు బరువు పెరగాలంటే ఏం తినాలి?

First Published | Mar 9, 2024, 11:03 AM IST

బక్కగా ఉన్నవాళ్లను ప్రతి ఒక్కరూ వెక్కిరిస్తూనే ఉంటారు. పుల్లలా ఉన్నావ్.. మరీ ఇంత బక్కగనా అని ఎగతాళి చేస్తుంటారు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ను తింటే మీరు కూడా ఈజీగా బరువు పెరుగుతారు. 
 

weight gain

కొంతమంది మరీ లావుగా ఉంటే.. మరికొంతమంది మాత్రం మరీ బక్క పల్చగా ఉంటారు. తక్కువ బరువు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. బరువు తక్కువగా ఉండటం వల్ల ఏ పనీ చేయలేరు. అలాగే తొందరగా అలసిపోతుంటారు. అంతేకాకుండా బక్కగా ఉన్నావంటూ అందరూ వెక్కిరిస్తుంటారు కూడా. దీనికి తోడు దుస్తులు కూడా అంతగా సెట్ కావు. అందుకే సన్నగా ఉన్నవారు ఖచ్చితంగా బరువు పెరగాలనుకుంటారు. కానీ ఎలా పెరగాలో తెలియదు. అసలు ఏం తింటే మీరు సహజంగా బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

మీరు హెల్తీగా బరువు పెరగాలనుకుంటే మాత్రం ఏవి పడితే అవి తినకూడదు. రోజూ సమతుల్య ఆహారాన్ని మాత్రమే తినండి. మీ రోజువారి ఆహారంలో విటమిన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. 

Latest Videos


బరువు పెరగాలని చాలా మంది ఫుడ్ ను మరీ ఎక్కువగా తింటుంటారు. అంటే రోజుకు మూడు పూటల కాకుండా ఐదారు సార్లు తింటుంటారు. ఇలా చేస్తే మీరు బరువు పెరుగుతారనుకుంటే పొరపాటే. ఇలా రోజుకు ఐదారు సార్లు తింటే మీ బాడీలో చెడు కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 
 

Image: Getty Images

చాలా మంది బరువు పెరగాలని ఏవేవో తింటుంటారు. ముఖ్యంగా బేకరీ ఫుడ్స్, ఫ్రై చేసిన వాటిని ఎక్కువగా తింటుంటారు. కానీ బరువు పెరగడానికి వీటిని అసలే తినకూడదు. వీటివల్ల మీరు బరువు పెరగరు. కానీ మీ పొట్ట మాత్రం పెరుగుతుంది. 
 

బక్కగా ఉన్నాలే.. ఇక నాకు వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు ఎందుకు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. బరువు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఇవి చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మీ భ్రమే. ఎందుకంటే వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరమే. బక్కగా ఉన్నా సరే వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఫిట్ గా చేస్తుంది. మీ కండరాలను పెంచుతుంది. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. తెల్లవార్లూ ఫోన్ లో గడుపుతూ ఏ అర్థరాత్రికో నిద్రపోతున్నారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిద్రలేమి వల్ల కూడా మీరు బరువు పెరగరు. మీరు బరువు పెరగాలనుకుంటే మాత్రం కంటినిండా నిద్రపోవాలి. 
 

బరువు పెరగాలనుకుంటే మీరు ప్రతి రోజూ ఉదయం లేదా రాత్రిపూట గ్లాస్ పాలను తాగండి. దీనివల్ల మీ శరీరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది మీరు బరువు పెరగడానికి కూడా బాగా  సహాయపడుతుంది. అయితే పాలలో తెల్ల చక్కెరను అసలే వేసుకోకూడదు. 

పౌష్టికాహారం తిన్నా కూడా మీరు నేచురల్ గా బరువు పెరుగుతారు. ఇందుకోసం రోజూ అరటి పండ్లు, సపోటా పండ్లను తినండి. ఎందుకంటే ఈ పండ్లలో శరీర పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, మటన్, కూరగాయలను కూడా తినండి. ఇవి కూడా మీ బరువును పెంచుతాయి. 

click me!