వ్యాయామం చేసిన తర్వాత గుండెల్లో మంటగా ఉందా?

First Published Apr 26, 2023, 11:38 AM IST

కొంతమందికి వ్యాయామం చేసిన తర్వాత ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. 
 

acidity

భారీ వ్యాయామం తర్వాత చాలా మందికి యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి చాలా కామన్. తీవ్రమైన లేదా చికాకు కలిగించే కదలికల వ్యాయామాలు కడుపులోకి ఆమ్లాన్ని అన్నవాహిక వైపు నెట్టేస్తాయి. ఇది గుండెల్లో మంట లేదా చికాకుకు దారితీస్తుంది. వ్యాయామం తర్వాత కొంతమందికి అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ ఒక సాధారణ సమస్య కావొచ్చు. అయితే వ్యాయామం చేయడానికి ముందు హెవీగా తినడం వల్లే ఇలా అవుతుంది. మరి ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

acidity

వ్యాయామం చేయడానికి ముందు హెవీగా తినడం మానుకోండి

వ్యాయామం చేయడానికి ముందు తేలికపాటి భోజనం లేదా చిరుతిండిని మాత్రమే తినండి. ఎందుకంటే ఇవి మీ కడుపును తేలికగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే వ్యాయామాన్ని స్టార్ట్ చేయడానికి ముందు కనీసం 30 నిమిషాల నుంచి అరగంట పాటైనా రెస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


acidity

హైడ్రేట్ గా ఉండండి

వ్యాయామానికి ముందు, వ్యాయామం చేసే సమయంలో, ఆ తర్వాత నీటిని పుష్కలంగా తాగండి. ఎందుకంటే వాటర్ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. నిర్జలీకరణం యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచుతుంది. అందుకే నీటిని, ద్రవాలను పుష్కలంగా తాగండి. 
 

Acidity

వెంటనే పడుకోకండి

వ్యాయామం చేసిన వెంటనే పడుకోవడం మానేయాలి. ఇందుకంటే ఇలా చేస్తే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వ్యాయామం తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట తర్వాతే పడుకోండి. 

యాంటీ యాసిడ్ 

ఓవర్ ది కౌంటర్ యాంటీ-యాసిడ్స్ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే వీటిని తప్పకుండా తీసుకోండి. అలాగే  జీవనశైలి అలవాట్లను మార్చుకోండి.

acidity

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని వాటర్ లో కలిపి తాగండి. ఇది కడుపు ఆమ్లాలను తటస్తం చేయడానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా మీ శరీరంలో ఉప్పు తీసుకోవడాన్ని పెంచుతుంది. అందుకే దీనిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

click me!