ఎండాకాలంలో కూడా జలుబు చేసిందా? తగ్గాలంటే ఇలా చేయండి

First Published Apr 25, 2023, 3:54 PM IST

చలికాలం, వానాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా జలుబు చేస్తుంది.  చల్లని ఐస్ క్రీం లు, కూల్ వాటర్  తాగడం వంటి వివిధ కారణాల జలుబు చేస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే జలుబును సులువుగా తగ్గించుకోవచ్చు. 

cold

గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఇవన్నీ జలుబు లక్షణాలే. కానీ మనలో చాలా మందికి వేడిలో కూడా జలుబు చేస్తుంది. వైరల్ అని పిలువబడే ఈ ఇన్ఫెక్షన్ జలుబు బారిన పడేస్తుంది. కెనడియన్ ఫార్మసీ ప్రకారం.. ప్రతి నలుగురిలో ఒకరు సమ్మర్ కోల్డ్ బారిన పడుతున్నారు. ఇది ఒక సాధారణ వ్యాధి. ఇది ప్రయాణం, ఒకరి నుంచి ఒకరికి, అధిక ఎయిర్ కండిషనింగ్ వల్ల అభివృద్ధి చెందుతుంది. 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. ఎండాకాలంలో జలుబు 200 కంటే ఎక్కువ లక్షణాలకు కారణమవుతుంది. తుమ్ములు, గొంతు నొప్పి, ముక్కు కారటం జలుబును సూచించే చిన్న లక్షణాలు. ఈ సమ్మర్ కోల్ట్ ఇతర జలుబు మాదిరిగా లక్షణాలను అనుభవిస్తారు. చలికాలంలో మాత్రమే జలుబు లక్షణాలు కనిపిస్తాయని కొందరు నమ్ముతారు. చాలాసార్లు వేసవి జలుబు అలెర్జీలు, ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది.

దీని లక్షణాలు 

తరచూ దగ్గు గొంతునొప్పి 
తీవ్రమైన తలనొప్పి
జ్వరంతో ఒళ్లు నొప్పులు,
ముక్కు దిబ్బడ

Latest Videos


water

పుష్కలంగా నీటిని తాగాలి

పెరుగుతున్న ఉష్ణోగ్రతలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కాఫీ, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ పానీయాలు నిర్జలీకరణ ప్రమాదాన్ని పెంచుతాయి. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి డిటాక్స్ డ్రింక్స్ ను తాగండి. లస్సీ, కొబ్బరి నీరు, నిమ్మరసాలు కూడా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఎండాకాలంలో ఎక్కువ చల్లని పదార్థాలను తినడం, తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ శరీరానికి హాని కలిగిస్తుంది. 
 

ఇతర వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి

ఎన్ఐహెచ్ ప్రకారం.. జలుబు సోకిన వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మీరు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. కలుషితమైన ప్రదేశాలు, వస్తువులను తాకొద్దు. మీరు దేనినైనా తాకినట్టైతే ఆ వెంటనే మీ చేతులను శుభ్రం చేసుకోండి. తరచుగా చేతులు కడుక్కోండి. జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి. 
 

Image: Pexels

మూలికల వాడకం

ఔషధ గుణాలున్న మూలికలను నీటిలో మరిగించి తాగడం వల్ల శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. గొంతునొప్పి, జలుబు నుంచి కూడా  ఉపశమనం లభిస్తుంది. దీని కోసం, లైకోరైస్, యాలకులు, సోంపు, అల్లాన్ని వాడండి. రోజుకు ఒక కప్పు కషాయం తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు గ్రీన్ టీని కూడా తీసుకోవచ్చు.
 

ముఖాన్ని తాకకుండా ఉండండి

ఇంటి నుంచి బయటకు వస్తే పదేపదే ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా చేతులను నోరు, ముక్కుకు దూరంగా ఉంచండి. ఇది మిమ్మల్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లు సోకితే దగ్గు, జలుబు వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. ఇందుకోసం హ్యాండ్ శానిటైజర్ వాడండి. 

click me!