కొత్తిమీర
కొత్తిమీరను ఎక్కువగా గార్నిషీ కోసం ఉపయోగిస్తారు. కొత్తిమీర రుచికే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కూడా ఉంటాయి. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. కొత్తిమీరలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్స్, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.