మన శరీరంలోని ప్రతి భాగం మృదువుగా ఉంటుంది. కానీ వీటిలో మన కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలను వాడుతున్నారు. కంటి సంరక్షణలో ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద సమస్యలనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దీనివల్లే ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయి. ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లను మితిమీరి వాడటం వల్ల కళ్లు బలహీనపడతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల నొప్పి వస్తుంది. మరి ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..