Health Tips: వేలాడే పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తేనెని ఇలా చేయండి?

Published : Jul 31, 2023, 11:57 AM IST

Health Tips: నేటి జీవన పరిస్థితులలో, ఊబకాయం తోనూ, వేలాడే పొట్టతోను చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి తేనే దివ్య ఔషధం. దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.  

PREV
16
Health Tips: వేలాడే పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తేనెని ఇలా చేయండి?

నిజానికి తేనే వేగంగా బరువు తగ్గటానికి ఉపయోగపడే ఒక సహజమైన దివ్య ఔషధం. కేవలం వ్యాయామం చేయడం వలన వేలాడే పొట్ట ఊబకాయం తగ్గదు అందుకే మీ ఆహారంలో తేనెని చేర్చుకోండి. మీ వేలాడే పొట్ట  తగ్గటం కోసం తేనెను ఎలా వాడాలో చూద్దాం.

26

తేనెని పుదీనాలో కలిపి తీసుకోవటం ద్వారా జీర్ణక్రియ స్థాయి పెరుగుతుంది. టీ స్పూన్ పుదీనా రసంతో రెండు టీ స్పూన్ల తేనె కలిపి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు.

36

అలాగే ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక చిన్న నిమ్మకాయ రసం తీసుకుని కలిపి పరగడుపునే తాగండి ఇది కచ్చితంగా పొట్టని చాలా త్వరగా కరిగిస్తుంది.

46

అలాగే ఒక టీ స్పూన్ తేనెతో రెండు టీ స్పూన్ల తులసి రసం కలిపి తీసుకోండి. క్రమం తప్పకుండా తీసుకోవడం వలన బరువు తగ్గటంతో పాటు జీర్ణవ్యవస్థకు మంచిది. అలాగే వ్యాధినిరోధకత కూడా పెరుగుతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె..

56

రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రసం పొద్దున్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలలో రెండు టీ స్పూన్ల తేనె కలుపుకొని..

66

తాగటం వలన మంచి నిద్ర పట్టడానికే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది దీని వలన కొవ్వు తగ్గుతుంది. అయితే వీటిని తీసుకోవటంతోనే సరిపెట్టకుండా అవసరమైన వ్యాయామం చేయటం, జంక్ ఫుడ్ కి వీడ్కోలు చెప్పటం చాలా అవసరం.

click me!

Recommended Stories