బెర్రీలు
సాధారణంగా బెర్రీల్లో ఇతర పండ్ల కంటే తక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది. అందుకే ఇవి డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే లేదు. బెర్రీలో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. బెర్రీలలో ఉండే ఫైబర్ చక్కెర శోషణను మందగించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.