వ్యాయామం మానేస్తే బరువు పెరుగుతరు.. ఎందుకంటే?

Published : Jul 02, 2023, 11:33 AM ISTUpdated : Jan 11, 2024, 02:04 PM IST

అకస్మత్తుగా జిమ్ కు వెళ్లడం మానేస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అసలు వ్యాయామం చేయడం ఆపేసిన తర్వాత ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా?   

PREV
18
 వ్యాయామం మానేస్తే బరువు పెరుగుతరు.. ఎందుకంటే?
Weight Loss

కొంతమంది ఆడవారు కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా జిమ్ లో బాగా కష్టపడతారు. అధిక-తీవ్రత వ్యాయామాలు చేస్తే తొందరగా బరువు తగ్గుతారు. కానీ ఇంట్లో  లేదా ఆఫీస్ పనులు జిమ్ కు అడ్డంకిలా మారుతాయి. అయితే అకస్మాత్తుగా జిమ్ లో వర్కవుట్స్ చేయడం మానేయడం వల్ల వీళ్లు బాగా బరువు పెరుగుతారు. జిమ్ కు వెళ్లకుంటే ఎందుకు బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

28
Weight Loss

మీరు జిమ్ కు వెళ్లడం మానేస్తే మీరు ఎంత త్వరగా బరువు పెరుగుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి బరువు పెరగడం అనేది మీ జీవక్రియ, ఆహారం, జీవనశైలి, జెనెటిక్స్ వంటి వ్యక్తిగత అంశాలపై చాలా ఆధారపడి ఉంటుంది. కొంతమంది కొన్ని వారాల్లోనే బరువులో మార్పును గమనిస్తారు. మరికొందరికి ఈ మార్పు కనిపించడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. కానీ సాధారణంగా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆ కేలరీలను బర్న్ చేస్తున్నప్పుడు కూడా ఫ్యాట్ ఫుడ్స్ ను తింటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. 

38
Weight Loss


వ్యాయామం మానేసినప్పుడు బరువు పెరగకూడదంటే ఏం చేయాలంటే? 

మీ ఆహారాన్ని గమనించండి

మీరు ప్రస్తుతం వ్యాయామం చేయట్లేదు కాబట్టి మీరు కేలరీలను తక్కువగా తీసుకోవాలి. మీరు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉండే పానీయాలను తగ్గించాలి. ఫ్రైస్, బర్గర్లు , చల్లని ఏరేటెడ్ పానీయాలకు నో చెప్పండి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తాగండి. 
 

48
weight loss

అవసరానికి మించి తినొద్దు

మీరు ఆహార ప్రియులు అయినా.. కాకపోయినా.. అవసరానికి మించి అస్సలు తినకండి. ముఖ్యంగా కేలరీలు ఎక్కువున్న ఆహారాలను. కానీ జిమ్ లో మీరు చేసిన ప్రయత్నాలు వృథా కాకూడదనుకుంటే మీరు ఎంత తింటున్నారో గమనించండి. వీలైనంత వరకు తక్కువగా తినడానికి ప్రయత్నించండి.
 

58

పై చిత్రాన్ని https://www.bio-bean.com/ నుంచి తీసుకున్నాం.

నీళ్లను ఎక్కువగా తాగండి

కొన్ని కొన్ని సార్లు మనకు దాహానికి, ఆకలికి తేడా తెలియదు. దాహం అయినా ఆకలిగానే భావించి తినేస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేసే స్నాక్స్ నే తింటుంటారు. అందుకే హైడ్రేటెడ్ గా ఉండండి. ఆకలి తగ్గుతుంది. అతిగా తినడం కూడా తగ్గుతుంది. దీనేముందు నీళ్లను తాగితే తక్కువగా తింటారు. ఇది మీరు బరువు పెరగకుండా చేస్తుంది. 
 

68

యాక్టీవ్ గా ఉండండి

జిమ్ చేయకపోయినా యాక్టివ్ గా ఉండండి. నడకతో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే మీరు ఖచ్చితంగా వాకింగ్ చేయండి. రన్నింగ్,  బైక్ రైడ్ లేదా ఇంట్లో కొన్ని వ్యాయామాలను కూడా ప్రయత్నించొచ్చు. ఇవి మీరు బరువు పెరగకుండా ఆపుతాయి. 
 

78

నీళ్లను ఎక్కువగా తాగండి

కొన్ని కొన్ని సార్లు మనకు దాహానికి, ఆకలికి తేడా తెలియదు. దాహం అయినా ఆకలిగానే భావించి తినేస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేసే స్నాక్స్ నే తింటుంటారు. అందుకే హైడ్రేటెడ్ గా ఉండండి. ఆకలి తగ్గుతుంది. అతిగా తినడం కూడా తగ్గుతుంది. దీనేముందు నీళ్లను తాగితే తక్కువగా తింటారు. ఇది మీరు బరువు పెరగకుండా చేస్తుంది. 
 

88

బాగా నిద్రపోండి

నిద్ర లేకపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. దీనివల్ల మీరు అనారోగ్యకరమైన ఆహారాన్నే తినాలనుకుంటారు. మీరు బరువు పెరగకుండా ఉండటానికి ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.

Read more Photos on
click me!

Recommended Stories