ప్రస్తుతం చాలా మంది మిల్క్ టీ కంటే గ్రీన్ టీ నే ఎక్కువగా తాగుతున్నారు. కొంతమంది దీన్ని రెగ్యులర్ గా తాగుతుంటారు. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు.గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఇతర ప్రాసెస్ చేయని ఆహారాలలో ఉంటుంది.