జర్నీలో పీరియడ్స్ వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే?

First Published Jun 2, 2023, 3:41 PM IST

చాలా మందికి జర్నీ సమయంలోనే పీరియడ్స్ వస్తుంటాయి. ఇది ఇబ్బందిగా ఉంటుంది. అసలు ప్రయాణం చేస్తుంటేనే పీరియడ్స్ ఎందుకు వస్తాయో తెలుసా? 
 

మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తాయా? నిజానికి చాలా మందికి ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు కూడా కావొచ్చు. కానీ ప్రయాణంలో పీరియడ్స్ రావడం ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలాసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే? 

మీ రుతుచక్రం పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ ద్వారా స్రవించే హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఆహారాలు, శారీరక అలసట నుంచి ఒత్తిడి వరకు మీ శారీరక లేదా భావోద్వేగ స్థితిలో ఏవైనా మార్పులు మీ హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. అలాగే రుతుస్రావం లేకపోవడం లేదా సక్రమంగా ఉండవు. అండోత్సర్గానికి హార్మోన్ల సమతుల్యత అవసరం. కాబట్టి మీ హార్మోన్లు అసమతుల్యంగా ఉంటే మీ రుతుచక్రం దాని ద్వారా ప్రభావితమవుతుంది. 

ప్రయాణాలు రుతుచక్రం లేదా రుతుస్రావంపై నేరుగా ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు. రుతుచక్రం ప్రధానంగా శరీరంలోని హార్మోన్ల మార్పుల ద్వారా ప్రభావితమవుతుంది. అయితే జర్నీకి సంబంధించిన కొన్ని అంశాలు రుతుస్రావానికి దారితీస్తాయి. ఎలాగంటే? 

ఒత్తిడి

ముఖ్యంగా ఎన్నో టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీర సహజ సిర్కాడియన్ లయలకు అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా రుతు చక్రంలో మార్పులకు దారితీస్తాయి.

ఆహారం, వ్యాయామంలో మార్పులు

జర్నీ చేసేటప్పుడు ఆహారం, శారీరక కార్యకలాపాల స్థాయిలో మార్పులు ఉండొచ్చు. ఆహారం, వ్యాయామ విధానాలలో ఆకస్మిక మార్పులు కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. 

పర్యావరణ కారకాలు

వాతావరణంలో మార్పు లేదా ఎత్తులలో ప్రయాణించడం వల్ల కూడా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన ఉష్ణోగ్రత, వేడి లేదా వాయు పీడనంలో మార్పులు శారీరక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పర్యావరణ కారకాలు కొంతమంది వ్యక్తులలో రుతుక్రమ విధానాలను ప్రభావితం చేస్తాయి.

దినచర్యలో అంతరాయం

జర్నీ వల్ల స్లీపింగ్, తినే టైమింగ్స్ మారుతుంటాయి. ఈ అంతరాయాలు పరోక్షంగా హార్మోన్ల నియంత్రణను ప్రభావితం చేస్తాయి. ఇది రుతు చక్రాలలో మార్పులకు కారణమవుతాయి.

click me!