ఇవి క్యాన్సర్ వచ్చేలా చేస్తయ్ జాగ్రత్త..

First Published Jun 2, 2023, 2:05 PM IST

క్యాన్సర్ ను మొదట్లో గుర్తించలేం. దీనివల్లే ఎంతోమంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. పేలవమైన జీవన శైలి క్యాన్సర్ రోగుల సంఖ్యను రోజు రోజుకు పెంచుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

cancer

క్యాన్సర్ గురించి తెలియనవి వారు ఉండరు. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన క్యాన్సర్ వస్తుంది. నేడు ప్రపంచంలో ఈ వ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు. కానీ ఈ వ్యాధి సకాలంలో గుర్తించబడదు. ఇదే పెద్ద ఎదురుదెబ్బ. పేలవమైన జీవనశైలి క్యాన్సర్ రోగుల సంఖ్యను పెంచుతుందని ఎన్నో అధ్యయనాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

cancer

ఆహారం

మనం ఎలాంటి ఆహారాన్ని తిన్నా అది మన ఆరోగ్యంపై ఏదో ఒకవిధమైన ప్రభావం చూపుతుంది. మంచి ఆహారమైతే ఎలాంటి సమస్య ఉండదు. చెడు ఆహారం అయితేనే ఎన్నో రోగాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి ఆహారాలు క్రమంగా మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం మిమ్మల్ని క్యాన్సర్ బారిన పడేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఆహారాల్లో ఉండే హానికరమైన పదార్థాలు క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

ఊబకాయం

పేలవమైన జీవనశైలి వల్ల  కొంతమందిలో ఊబకాయం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. దాదాపు 13 రకాల క్యాన్సర్లు ఊబకాయంతో ముడిపడి ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే  ఊబకాయం ఉన్నవారిలో క్యాన్సర్ మరణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడతారని క ాదు. అయినప్పటికీ అధిక బరువు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Image: Getty

స్మోకింగ్

స్మోకింగ్, క్యాన్సర్ మధ్యున్న సంబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనివల్ల వచ్చే సమస్యలు అందరికీ తెలిసిందే. స్మోకింగ్ ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. స్మోకికంగ్ నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, కాలేయం, ఊపిరితిత్తులు, పురీషనాళం, క్లోమం, మూత్రపిండాలు వంటి ఎన్ననో అవయవాలను ప్రభావితం చేసే క్యాన్సర్ కు దారితీస్తుంది.
 

cancer

హెపటైటిస్-బి

హెపటైటిస్ బి వైరస్ 10 కి పైగా క్యాన్సర్లతో ముడిపడి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హెపటైటిస్ సి వైరస్ కూడా చాలా ప్రమాదకం. దీనివల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 
 

హెచ్ పివి

హెచ్ పీవీ వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్పివీ ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాలా మంది మహిళల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అసురక్షిత ఓరల్ సెక్స్ హెచ్పివీ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవలి అధ్యయనం సూచించింది.

click me!