మన దైనందిన జీవితంలో ఎన్నో కారణాల వల్ల ఒత్తిడికి గురవుతుంటాం. ఇంటి పనులు, ఆఫీసు పనులు, పిల్లల బాగోగులు, కుటుంబం బాధ్యతలు మూడ్ స్వింగ్స్ కు కారణమవుతాయి. ముఖ్యంగా ఇవి ఆడవాళ్ల మూడ్ ను నాశనం చేస్తుంటాయి. దీనివల్ల ఆడవాళ్లకు పట్టరాని కోపం, చిరాకు, విసుగు ఎక్కువవుతాయి. ఈ భావాలన్నింటినీ వీళ్లు గట్టిగా అరవడం, తిట్టడం, ఇంట్లో సామాన్లను కిందేయడం వంటి పనుల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇక కొంటె పనులు, అల్లరి పనులు చేసే పిల్లలున్న ఇండ్లలో ఆడవాళ్లు గట్టి గట్టిగా అరుస్తూనే ఉంటారు. ఇలా అరవడం నిత్యకృత్యంగా మారుతుంది. కానీ దీనివల్ల పిల్లలకు శారీరక, మానసిక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.