మీరు వెస్ట్రన్ టాయిలెట్ ను ఉపయోగిస్తారా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం..

First Published | Feb 17, 2024, 12:39 PM IST

పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్స్ ను ఉపయోగిస్తున్నారు. ఈ టాయిలెట్స్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. కానీ వీటి వాడకం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా? 
 

toilet general

చాలా మంది ఇండ్లలో వెస్ట్రన్ టాయిలెట్ నే ఉపయోగిస్తున్నారు. ఈ మరుగుదొడ్లు కడుపును ఖాళీ చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉండటంతో  అందరూ వీటిని వీటిని ఉపయోగించడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  ముసలివాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇండియన్ టాయిలెట్ కంటే వెస్ట్రన్ టాయిలెట్  చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే వీటి వాడకం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. 
 

కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును ఈ మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. ఎలా అంటే వెస్ట్రన్ టాయిలెట్ సీటు శరీరంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఈ కారణంగా సంక్రమణ ప్రమాదం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు వస్తాయి. వెస్ట్రన్ టాయిలెట్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos


మలబద్ధకం

పొట్టను క్లీన్ చేసేటప్పుడు సరైన శరీర భంగిమలో ఉండటం చాలా ముఖ్యం. ఇండియన్ టాయిలెట్ సీటులో కూర్చోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది పొట్టను బాగా శుభ్రపరుస్తుంది. కానీ వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చోవడం వల్ల కడుపు, మలద్వారం కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీ కడుపు సరిగా శుభ్రం కాదు. అలాగే ఇది మలబద్దకానికి కూడా దారితీస్తుంది.
 

యూరినరీ ఇన్ఫెక్షన్

వెస్ట్రన్ మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ లో మలవిసర్జన చేయడానికి కూర్చున్నప్పుడు సీటు నేరుగా శరీరాన్ని తాకుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ టాయిలెట్ లో టిష్యూ పేపర్ ఉపయోగించడం వల్ల మలం లేదా టిష్యూ పేపర్ యోనిలోకి ప్రవేశిస్తే సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.
 

పైల్స్ 

వెస్ట్రన్ టాయిలెట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మలబద్దకం దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. దీనివల్ల మలవిసర్జన చేసేటప్పుడు ఆనల్ కండరాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. కడుపును ఖాళీ చేయడంలో ఇబ్బంది దిగువ పురీషనాళం, పాయువు సిరలలో వాపు వస్తుంది. ఇది పైల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. 
 

అపెండిసైటిస్ ప్రమాదం

ఈ మరుగుదొడ్డిని ఉపయోగించడం వల్ల కూడా అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి వెస్ట్రన్ టాయిలెట్ లో మలవిసర్జన చేయాలంటే కడుపుపై చాలా ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కడుపుపై అధిక ఒత్తిడి కారణంగా అపెండిక్స్-అపెండిసైటిస్ వ్యాధి ప్రమాదం బాగా పెరుగుతుంది.

పొట్టను క్లీన్ చేయడానిక ఇండియన్ టాయిలెట్ ను ఉపయోగించడం మంచిది. ఈ మరుగుదొడ్డిలో మన శరీరం స్క్వాట్ పొజిషన్ లో ఉంటుంది. ఇది మన మొత్తం జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే కడుపును సరిగ్గా శుభ్రపరుస్తుంది. కానీ మీరు కొన్ని కారణాల వల్ల వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తుంటే.. మీ పాదాల కింద ఒక చిన్న స్టూల్ ను ఉంచండి. ఇది మలబద్ధకం, ఇతర సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. 

click me!