మీ గుండె ఆరోగ్యంగానే ఉందా..? ఇలా తెలుసుకోండి..!

First Published Apr 4, 2024, 2:24 PM IST

మనం మన గుండె సరిగా పని చేస్తుందో లేదో ముందే తెలుసుకోవాలి..? గుండె సరిగా పని చేస్తుందో లేదో ముందే ఎలా తెలుసుకోవాలి అనే సందేహం మీకు కలగొచ్చు.

heart

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. సడెన్ కార్డియాక్ అరెస్టులు మరింత ఎక్కువ అయ్యాయనే చెప్పొచ్చు. చిన్న పిల్లలు, నడి వయస్కులు కూడా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. 
 

దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. కొందరికి పొగతాగే అలవాటు ఉండొచ్చు. కొందరికి విపరీతమైన ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల.. వారికి ఈ సమస్యలు వచ్చి ఉండొచ్చు.  కానీ ఆ హార్ట్ ఎటాక్ ఎప్పుడు ఎటాక్ చేస్తోంది అనే విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాం.  వ్యాయామాలు చేస్తూ, డ్యాన్స్  చేస్తూ కుప్పకూలిలనవారు కూడా ఉన్నారు. అప్పటిదాకా మంచిగా ఉన్న మనిషి.. మరు నిమిషంలో ఏమైపోతున్నాడో గుర్తించలేకపోతున్నాం.
 

అందుకే.. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన గుండె సరిగా పని చేస్తుందో లేదో ముందే తెలుసుకోవాలి..? గుండె సరిగా పని చేస్తుందో లేదో ముందే ఎలా తెలుసుకోవాలి అనే సందేహం మీకు కలగొచ్చు. ఈ కింది విషయాల ద్వారా.. మన గుండె పనితీరు సరిగానే ఉంది అనే విషయాన్ని నిర్థారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 

heart

మనం రెగ్యలుర్ గా మన బీపీ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి.  బీపీ నార్మల్ రేంజ్ 120/80 . ఇందులో కనుక తేడాలు ఉంటే.. వైద్యలను సంప్రదించాలి. వీటితోపాటు కొలిస్ట్రాల్ లెవల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ldl అంటే చెడు కొలిస్ట్రాల్ ఇది మన శరీరంలో  100 mg/dlదాటకుండా చూసుకోవాలి. ఇక HDL అంటే మంచి కొలిస్ట్రాల్ 40 వరకు ఉండొచ్చు.
 

heart attack

హార్ట్ బీట్ కూడా మంచిగా ఉండాలి. మన హార్ట్ నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి.  దానిలో ఏమైనా తేడాలు ఉన్నా వైద్యులను సంప్రదించవచ్చు. అయితే.. ఒక్కసారి చెక్ చేసుకొని మీకు హెల్త్ బాలేదని భయపడొద్దు. మీరు ఎలాంటి టెన్షన్ లో లేకుండా.. ప్రశాంతంగా ఉన్న సమయంలోనే హార్ట్ బీట్ చెక్ చేసుకోవాలి.
 

heart attack

బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ) తో మన గుండె పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. బీఎంఐ రేటు ఎప్పుడూ 18.5 నుంచి 24.9 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా.. శరీరానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. అందుకే.. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉండాలి. అప్పుడే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం వారానికి ఎలా లేదు అన్నా 150 నిమిషాలు అయినా వ్యాయామం చేసేలా చూసుకోవాలి.
 

heart attack 1

ఇక.. మనం ఎక్కువగా నూనెలో వేయించిన ఆహారాలు, ఫ్యాట్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ మన ఆహారంలో కూరగాయలు, పండ్లు భాగం చేసుకోవాలి.

వీటితో పాటు..  బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా  హార్ట్ తో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే.. షుగర్ లెవల్స్.. 100 mg/dl ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు.. పొగాకు తాగే అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయాలి. పొగాకు అలవాటును ఎంత తగ్గించుకుంటే.. మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇక.. మీ ఫ్యామిలీలో గతంలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో చూసుకోవాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. ఒక్కోసారి ఫ్యామిలీ లో ఉండటం వల్ల కూడా రావచ్చు. కాబట్టి.. ముందుగానే వైద్యులను సంప్రదించడం మంచిది.
 

click me!