డయాబెటీస్ ఉన్నవాళ్లు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే బ్లడ్ షుగర్ పెరగదు

First Published | Mar 29, 2024, 2:09 PM IST

డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స లేనేలేదు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలితో దీన్ని నియంత్రించొచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డయాబెటీస్ ఉన్నవాళ్లు పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. 

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ ఒక సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే చికిత్స లేదు. కేవలం నియంత్రించగలం అంతే. ఈ వ్యాధిని కొన్ని జాగ్రత్తలతో అదుపులో ఉంచొచ్చు. డయాబెటిస్ ఎన్నో కారణాల వల్ల వస్తుంది. కానీ చాలా వరకు ఈ వ్యాధికి ప్రధాన కారణం మన అనారోగ్య అలవాట్లే. ఈ వ్యాధి వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని సకాలంలో నియంత్రించకపోతే గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలు మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు కొన్ని పనులు చేయాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇవి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


1. రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకుని తప్పు మాత్రం చేయకండి. ఎందుకంటే దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే తిన్న తర్వాత ఒక అరగంట పాటు నెమ్మదిగా నడవండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి శరీరం దీన్ని బాగా ఉపయోగించుకోగలుగుతుంది. అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా మెయింటైన్ చేస్తుంది.
 

2. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర లేదా చక్కెరతో తయారైన పదార్థాలను తినడం మానుకోండి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

3. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాసనాలు వేయాలి. క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయండి. 

4. ముఖ్యంగా మధుమేహులు తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అందుకే రాత్రిపూట చక్కెర స్థాయిలు పెరగకూడదంటే రాత్రి భోజనం చేసిన గంట తర్వాత రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.

5. డయాబెటిస్ పేషెంట్లకు దంతాలు, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి పడుకునే ముందు దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇది మీ దంతాలు, చిగుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. 

diabetes

6. డిన్నర్ కు ముందు సలాడ్ తింటే కూడా మీ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ ఆహారంలో పిండి పదార్థాల పరిమాణం నియంత్రణలో ఉంటుంది. అలాగే సలాడ్ లో చేర్చిన కూరగాయల నుంచి కూడా మంచి పోషకాలను పొందుతారు. మీరు ప్రతి రోజూ రాత్రి 8-9 గంటలు తగినంత నిద్ర పోవాలి. 

click me!