గర్భిణులకు బోలు ఎముకల వ్యాధి రావొద్దంటే..!

First Published Jun 2, 2023, 12:50 PM IST

గర్భిణులకు బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సర్వసాధారణం అయినప్పటికీ ఇది గర్భిణుల ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే?

బోలు ఎముకల వ్యాధి వల్ల ఎముకలు చాలా పెళుసుగా, బలహీనంగా మారుతాయి. అలాగే ఎముక సాంద్రత కోల్పోవడం వల్ల ఎముకలు పగుళ్లు వస్తాయి. ఈ వ్యాధి వల్ల నడవడానికి, కదలడానికి కూడా కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది సర్వ సాధారణ సమస్య. బోలు ఎముకల వ్యాధి ఎవ్వరికైనా రావొచ్చు. ఇది గర్భధారణ సమయంలో కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో బోలు ఎముకల వ్యాధి అరుదైన సమస్య. కానీ ఇది వారి ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.
 

world osteoporosis day

బోలు ఎముకల వ్యాధి పగుళ్లను ఎక్కువగా చేస్తుంది, ముఖ్యంగా తుంటి, వెన్నెముక, ణికట్టులో. గర్భధారణ-సంబంధిత బోలు ఎముకల వ్యాధి ఉంటే.. మీరు వెన్నునొప్పి, ఎముక సాంద్రత కోల్పోవడం, గర్భధారణ సమయంలో, తర్వాత పగుళ్లు, తుంటి నొప్పి వంటి లక్షణాలను అనుభవించొచ్చు.

osteoporosis women

గర్భధారణ సమయంలో బోలు ఎముకల వ్యాధికి కారణాలు

గర్భిణీ స్త్రీలో హార్మోన్ల అసమతుల్యత ఎముక సాంద్రతలో తాత్కాలిక తగ్గుదలకు దారితీస్తుంది.
పిండం పెరుగుదలకు కాల్షియం ఎక్కువ అవసరం. కాబట్టి గర్భిణులు కాల్షియాన్ని ఎక్కువగా తీసుకోకపోతే తల్లి ఎముకల నుంచి కాల్షియం పిండానికి వెళుతుంది. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వస్తుంది.
మరొక కారణం విటమిన్ డి లోపం. ఇది కాల్షియం శోషణను దెబ్బతీస్తుంది.
మీ ఇంట్లో ఎవ్వరికైనా బోలు ఎముకల వ్యాధి ఉంటే గర్భధారణ సమయంలో మీకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
స్మోకింగ్, అనారోగ్యకరమైన ఆహారాలు, మందును ఎక్కువగా తాగడం వంటి కారణాల వల్ల కూడా ఎముకల సమస్యలు వస్తాయి. 

తల్లి పాలివ్వడం 

పాలిచ్చే సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది కాల్షియం శోషణను నిరోధిస్తుంది కాబట్టి తల్లి పాలివ్వడం వల్ల తాత్కాలికంగా ఎముక నష్టం కలుగుతుంది. అందుకే ఎముకలు బలంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బోలు ఎముకల వ్యాధిని నివారించే చిట్కాలు
 

ఎక్కువ ప్రోటీన్ తినండి: ఎముకల పెరుగుదలకు, మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి కాయధాన్యాలు, టోఫు, చేపలు, బీన్స్, గుడ్లు,  పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. 

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం: బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి, నిర్వహించడానికి కాల్షియం చాలా అవసరం. అందుకే కాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, సార్డినెస్, బచ్చలికూర, బాదంలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 
 

విటమిన్ డి : క్రమం తప్పకుండా విటమిన్ డి ని తీసుకోవడం వల్ల శరీరం ఆహారంలో ఉన్న కాల్షియాన్ని బాగా గ్రహిస్తుంది. చేపలు, కాలేయం, గుడ్లు వంటి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. సూర్య రశ్మికి ఉన్నా విటమిన్ డి లభిస్తుంది. 
 

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందుకోసం చియా విత్తనాలు, వాల్ నట్స్, కొవ్వు చేపలు, అవిసె గింజలను రోజూ తినండి.

ఆల్కహాల్, కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి: ఆల్కహాల్, కెఫిన్ ను ఎక్కువగా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇవి ఇతర ముఖ్యమైన పోషక శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడాన్ని తగ్గించండి.
 

Image: Getty

ధూమపానం: ధూమపానం, మద్యపానం రెండూ ఎముకల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే స్మోకింగ్ అలవాటును మానుకోండి. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: యోగా, పైలేట్స్ లేదా స్విమ్మింగ్ వంటి కండరాల బలాన్ని బలోపేతం చేసే వ్యాయామాలలో పాల్గొనండి. 

click me!