మానసికంగా వచ్చే సమస్యలు..
చిన్న చిన్న విషయాలకి కోప్పడే వారి వల్ల అందరికీ ఇబ్బందే. స్నేహితులు బంధువులతో తరచూ గొడవలు అవుతాయి. కోపానికి కారణం లేకపోతే సొంతవాళ్లు కూడా దూరమైపోతారు. అనవసరమైన విషయాల గురించి కోప్పడే వారిపై సొసైటీలో మంచి పేరు ఉండదు.
చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకునేవారు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్ససైజ్, వాకింగ్ లాంటివి చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.