ఆరోగ్యం, ఆహారం విషయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆహారంలో కొంచెం తేడా వచ్చిన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా హార్ట్ పేషెంట్స్ అయితే మరి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు మితంగా తినడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.
ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ అలవాట్ల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. మరి హార్ట్ ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. కొన్ని ఫుడ్స్ అయితే అస్సలు తినకపోవడం ఉత్తమం.
27
కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్
మనం తినే ఫుడ్ మన ఆరోగ్యంలో 80% పాత్ర పోషిస్తుంది. ఆహారం విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా హార్ట్ ఎటాక్ కి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ కి కాస్త దూరంగా ఉండాలి. హార్ట్ పేషెంట్స్ కి ప్రమాదం కలిగించే ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
37
కాఫీ
హార్ట్ పేషెంట్స్ ఎక్కువ కాఫీ తాగితే చాలా ప్రమాదం. కాఫీలో ఉండే కెఫిన్ బీపీని పెంచుతుంది. రోజుకి రెండు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
47
పండ్ల రసాలు
పండ్ల రసాలలో చక్కెర, కలర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి అంత మంచివి కావు. జ్యూస్ తాగే బదులు పండ్లు తినడం మంచిది. ముఖ్యంగా మామిడి పండు లాంటివి ఎక్కువ తినకూడదు.
57
గుడ్డు పచ్చసొన
గుడ్డు పచ్చసొనలో కొవ్వు, పోషకాలు ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. హార్ట్ పేషెంట్స్ వారానికి 1-2 సార్లు మాత్రమే గుడ్డు పచ్చసొన తినాలి.
67
పిస్తా
పిస్తాలో సోడియం ఎక్కువ. హార్ట్ పేషెంట్స్ దీన్ని తినకూడదు. సోడియం బీపీని పెంచుతుంది. తక్కువ మోతాదులో తినవచ్చు.
77
మైదా పదార్థాలు
మైదా పదార్థాలు హార్ట్ పేషెంట్స్ కి హానికరం. వీటిలో క్యాలరీస్ ఎక్కువ. ఇవి కొలెస్ట్రాల్ ని పెంచి హార్ట్ ఎటాక్ రిస్క్ ని పెంచుతాయి. మైదాతో చేసినవి తినడం అంత మంచిది కాదు.