వేడి వేడిగా నోరూరించే ఎగ్ పొటాటో కట్లెట్ స్నాక్ రెసిపీ.. ఏంటంటే?

First Published Jan 16, 2022, 2:23 PM IST

సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా మంచి స్పైసీ స్నాక్స్ (Spicy snacks) తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంటిలోనే ఎగ్, బంగాళదుంపలతో కట్లెట్ లను చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. వీటి తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఎగ్ పొటాటో కట్లెట్ (Egg potato cutlet) స్నాక్ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: నాలుగు గుడ్లు (Eggs), రెండు బంగాళదుంపలు (Potatoes), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ మిరియాల పొడి (Pepper powder), సగం స్పూన్ కారం (Chili powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder).
 

సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), రెండు పచ్చిమిర్చి (Chilies), చిటికెడు పసుపు (Turmeric), పావు కప్పు వేయించిన ఉల్లిపాయలు (Fried onions), కొత్తిమీర (Coriyander) తరుగు, సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger garlic paste),  ఒక కప్పు బ్రెడ్ పొడి (Bread crumbs), వేయించడానికి సరిపడా నూనె (Oil).
 

తయారీ విధానం: ముందుగా మూడు గుడ్లను, బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలను, గుడ్లను తురుముకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు (Salt to taste), మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పసుపు, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి (Mix well).

ఇలా అన్ని పదార్థాలను వేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని కట్లెట్ ఆకారంలో (Cutlet shape) వచ్చేలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న కట్లెట్ లను ముందుగా గుడ్డు సొనలో ముంచి తరువాత బ్రెడ్ పొడిలో (Bread crumbs) అద్దుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
 

పదినిమిషాల తర్వాత బయటకు తీయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి  వేయించడానికి సరిపడా నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి.నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కట్లెట్ లను వేసి తక్కువ మంట (Low flame) మీద ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కట్లెట్ లు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
 

ఇలా తయారయిన వేడివేడి ఎగ్ పొటాటో కట్లెట్ లను టమోటా కెచప్ (Tomato ketchup) తో సర్వ్ (Serve) చేయాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కట్లెట్ లను ఒకసారి ట్రై చేయండి. సాయంత్రం పూట ఈ స్నాక్ ను తయారు చేసుకుని కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ తింటే భలే సరదాగా ఉంటుంది. ఈ స్నాక్స్ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.

click me!