కాఫీ పొడితో ఇలా చేస్తే ఎలాంటి చర్మమైన మెరిసిపోతుంది.. ఏం చెయ్యాలంటే?

Navya G   | Asianet News
Published : Jan 16, 2022, 12:49 PM IST

కాఫీ పొడితో (Coffee powder) చర్మ సౌందర్యం అనగానే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కాఫీ పొడిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచే మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. అయితే ఇప్పుడు మనం మెరుగైన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం కాఫీ పొడి అందించే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
కాఫీ పొడితో ఇలా చేస్తే ఎలాంటి చర్మమైన మెరిసిపోతుంది.. ఏం చెయ్యాలంటే?

కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సాగనీయకుండా చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు, వలయాలు వంటి చర్మ సమస్యలు తగ్గి ముఖాన్ని కాంతివంతంగా, తాజాగా మారుస్తుంది. చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా మారుస్తుంది.
 

26

చర్మాన్ని తాజాగా ఉంచి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. ఇది చర్మానికి మంచి స్క్రబ్ (Scrub) గా, క్లెన్సర్ (Cleanser) గా సహాయపడుతుంది. కాఫీ పొడి చర్మానికి అందించే ప్రయోజనాలు అనేకం. కనుక చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడితో ఇంటిలోనే సహజసిద్ధమైన మంచి ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

36

కాఫీ పొడి, తేనె: ఒక కప్పులో కొంచెం కాఫీ పొడి (Coffee powder), ఒక స్పూన్ తేనె (Honey) వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం పై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకుంటే చర్మ సౌందర్యం కోసం మీరు ఆశించిన ఫలితం మీకు దక్కుతుంది.
 

46

కాఫీ పొడి, కలబంద గుజ్జు: ఒక కప్పులో ఒక స్పూన్ కాఫీ పొడి (Coffee powder), ఒక స్పూన్ తాజా కలబంద గుజ్జు (Aloevera pulp) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద ఉన్న నల్లటి వలయాల మీద అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తగ్గడంతో పాటు కంటిచుట్టూ ఉన్న వాపు కూడా తగ్గుతుంది.
 

56

కాఫీ పొడి, ఓట్ మీల్, పెరుగు: ఒక కప్పులో కొంచెం కాఫీ పొడి (Coffee powder), కొంచెం ఓట్ మీల్ పౌడర్ (Oatmeal powder), కొంచెం పెరుగు (Yogurt) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
 

66

కాఫీ పొడి, తేనె, పెరుగు: ఒక కప్పులో రెండు స్పూన్ ల కాఫీ పొడి (Coffee powder), రెండు స్పూన్ ల తేనె (Honey), రెండు స్పూన్ ల పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై నల్లటి వలయాలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.

click me!

Recommended Stories