ఈ పొరపాట్ల వల్లే జుట్టు రాలిపోయేది.. ఈ కొన్ని చిట్కాలు ప్రయత్నించండి!

Navya G   | Asianet News
Published : Jan 16, 2022, 11:48 AM IST

కలుషిత వాతావరణం కారణంగా దుమ్ము, ధూళి తలలో చేరుకుపోయి జుట్టు బలహీనపడి పలుచబడుతోంది. వీటితో పాటు ముఖ్యంగా జుట్టుకు అప్లై చేసుకునే హెయిర్ ప్రొడక్ట్స్ (Hair Products) లలో ఎక్కువగా గాఢత గల రసాయనాలు (Chemicals) ఉండడం. అయితే జుట్టు పలచబడుకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
ఈ పొరపాట్ల వల్లే జుట్టు రాలిపోయేది.. ఈ కొన్ని చిట్కాలు ప్రయత్నించండి!
hair fall

చాలామంది ఆడవాళ్లకి నుదిటి మీద జుట్టు పలచబడి (Thinning hair) పెద్ద సమస్యగా మారుతోంది. అయితే జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ (Special attention) తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనం తలస్నానం కోసం ఎంచుకునే షాపులలో, కండీషనర్ లలో ఎక్కువ గాఢత గల రసాయనాలు ఉండకుండా చూసుకోవాలి.

28

జుట్టు దువ్వుకునే సమయంలో పాపిడి తీసి పక్కకు దువ్వుకోవడం మంచిది. అలాకాకుండా జుట్టును భిన్నంగా పైకి ఎగదువ్వి గట్టిగా పోనీ వేయడం చేయరాదు. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లకు (Hair follicles) ఒత్తిడి (Stress) ఏర్పడి జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది. దీంతో జుట్టు పలుచగా మారుతుంది
 

 

38
hair fall

జుట్టును గట్టిగా దువ్వడం, బిగుతుగా రబ్బర్ బ్యాండ్ వేయడం, క్లిప్పులు పెట్టడంతో జుట్టు అధికంగా రాలిపోయి పలుచగా మారుతుంది. దీంతో పాటు తలనొప్పి (Headache) వచ్చే అవకాశం ఉంటుంది. హెయిర్ సౌందర్యం (Hair beauty) కోసం ఎలక్ట్రిక్ వస్తువుల వాడకం తగ్గించాలి.

 

48
hair fall

జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, అల్లడం చేయరాదు. ఎప్పటికప్పుడు భిన్నంగా కనిపించేందుకు తరచూ హెయిర్ స్టైల్స్ (Hairstyles) ను మారుస్తుంటారు కొందరు.  ఇలా చేస్తే జుట్టు అధిక ఒత్తిడికిలోనై ఎక్కువ రాలిపోవడం జరుగుతుందని తాజా పరిశోధనలో (Research) తేలింది.

58
hair fall

హార్మోన్లలో వచ్చే మార్పులు (Changes in hormones), తీవ్ర ఇన్ఫెక్షన్ (Infection) లు, అధిక ఒత్తిడి, హై ఫీవర్, టైఫాయిడ్, సర్జరీల కారణంగా కూడా జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వారిలో కూడా అధిక మొత్తంలో జుట్టు రాలే అవకాశం ఉంటుంది.

68

తలస్నానం (Head bath) చేసే సమయంలో నేరుగా షాంపూలను (Shampoo) తలకు అప్లై చేసుకోరాదు. ఇలా చేస్తే షాంపూలోని అధిక మొత్తంలో ఉండే రసాయనాలు నేరుగా తలకు చేరి జుట్టు రాలే అవకాశం ఉంటుంది. కనుక షాంపూను నీటిలో కలుపుకొని తర్వాత తలకు అప్లై చేసుకోవడం మంచిది.

78

తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ (Conditioner) ను అప్లై చేసుకోవాలి. ఎక్కువసేపు జుట్టును తడిగా ఉంచరాదు. శరీరం అధిక ఒత్తిడికి లోనైతే జుట్టు రాలే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా (Calmdown) ఉండేందుకు ప్రయత్నించాలి. 

88

జుట్టు పల్చబడటానికి పోషకాహార లోపం (Malnutrition), నిద్రలేమి సమస్యలు (Insomnia problems) కూడా కారణం కావచ్చు. కనుక తీసుకునే ఆహారంలో మంచి పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే వేళకు నిద్రపోతే  జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరుగుతుంది.

click me!

Recommended Stories