ఎప్పటికి యవ్వనంగా అందంగా కనిపించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

First Published Jan 8, 2022, 3:53 PM IST

 ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. కనుక వయసుకు తగ్గట్టు చర్మసౌందర్యం (Skin beauty) ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు (Precautions) తప్పనిసరి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై సన్న గీతలు, రంగు మారడం, ముడతలు (Wrinkles), వృద్ధాప్య ఛాయలు (Aging shades) వంటి లక్షణాలు కనిపించడం సహజమే. కానీ వయసుకు తగినట్లుగా కాకుండా ముందుగానే చర్మం ప్రభావితమై అవుతూ ఉంటుంది. దీంతో ముఖంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 

ఇలాంటి సమస్యలు ముందుగానే రాకుండా ఉండాలంటే చర్మ సౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. ఇందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చర్మంలో మార్పులు వస్తున్నాయి. శరీరం అధిక ఒత్తిడికి (High pressure) లోనైనప్పుడు కూడా చర్మ సమస్యలు (Skin problems) వచ్చే అవకాశం ఉంటుంది.
 

ఇలా చిన్న వయసులోనే చర్మ సమస్యలు రావడానికి ముఖ్య కారణం చర్మ సౌందర్యం కోసం అధిక మొత్తంలో రసాయనాలను (Chemicals) కలిగిన క్రీమ్ లను, ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తే ఇవి చర్మ సహజసిద్ధమైన నిగారింపును తగ్గించి చర్మాన్ని కాంతిహీనంగా మారుస్తాయి. కనుక చర్మ సౌందర్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా (Skin health) ఉంచుకోవచ్చు.
 

20 వయసులో హార్మోన్ల ప్రభావంతో (Effect of hormones) ముఖచర్మం పలు మార్పులకు లోనవుతుంది. దీంతో ముఖంపై మచ్చలు, మొటిమలు, కళావిహీనత, పొడిబారడం మొదలవుతుంది. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని (Healthy lifestyle) అలవరచుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్ర ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
 

నిద్రించే ముందు మేకప్ (Makeup) ను పూర్తిగా తొలగించి మాయిశ్చరైజర్ (Moisturizer) తో సున్నితంగా మసాజ్ చేసుకోవడం వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఇలా చేస్తే చర్మానికి తగిన తేమ అంది కాంతివంతంగా ఉంటుంది. ఎండలోకి వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ ను అరగంట ముందు తప్పక రాసుకోవాలి.
 

30 వయసులో జీవనక్రియలు నెమ్మదిస్తాయి. దీంతో చర్మం పొడిబారడం (Dry skin) లేదా ఎక్కువగా జిడ్డుగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ముఖానికి రసాయనరహిత లేపనాలను వాడడం మంచిది. అలాగే చర్మతత్వానికి సరిపడే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) ను ఎంచుకోవడం మంచిది.
 

40 వయసులో చర్మం డీహైడ్రేషన్ (Dehydration) కు గురవుతుంది. దీంతో పాటు చర్మం లూజుగా మారడం, ముడతలు పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొల్లాజెన్ (Collagen),  విటమిన్ ఏ  ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.

click me!