శాకాహారం మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అంతేకాదు ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి, కూరగాయలకు మధ్య సంబంధం చాలా గొప్పది. కూరగాయల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తింటే ఎన్నో లాభాలను పొందుతారు. శాఖాహారం శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్ గా కూరగాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..