బీపీ కంట్రోల్ లో ఉండాలంటే వీటిని పొరపాటున కూడా తినకండి

Published : Jun 04, 2023, 12:25 PM IST

మీకు బీపీ ఎక్కువగా ఉంటే మీరు తినే ఫుడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ రక్తపోటు బాగా పెరిగిపోతుంది.   

PREV
18
బీపీ కంట్రోల్ లో ఉండాలంటే వీటిని పొరపాటున కూడా తినకండి
Image: Getty

సోడియం (ఉప్పు) ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ద్రవ సమతుల్యత, నరాల పనితీరుకు,  కండరాల సంకోచాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ సోడియాన్ని మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీకు హై బీపీ సమస్య ఉంటే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు లక్షణాలు పెరుగుతాయి. అలాగే మీ గుండె ప్రమాదంలో పడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ రక్తపోటు స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే  ఆహారాలను తినకూడదు. 
 

28
Image: Getty

హైబీపీ రోగులు నివారించాల్సిన హై సోడియం ఫుడ్స్

రక్తపోటును పూర్తిగా తగ్గించుకోలేకపోవచ్చు. కానీ దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీని కోసం మీరు మందులను తప్పకుండా వాడాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి.  హై బీపీ పేషెంట్లు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

కొన్ని ఆకుకూరలు

ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ సెలెరీ, బచ్చలికూర, క్యారెట్లు, దుంపలు వంటి కొన్ని కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇది మీ రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మీ బీపీ స్థిరంగా ఎక్కువగా ఉంటే ఈ కూరగాయలను తినకండి. లేదా తక్కువగా తినండి. 

48
Cheese

జున్ను

జున్నులో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ దీనిలో ఉప్పు, సంతృప్త కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి.అంటే జున్నును ఎక్కువగా తినడం వల్ల మీ రక్తపోటు పెరగడంతో పాటుగా కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. జున్నును ఖచ్చితంగా తినాలనుకుంటే సోడియం తక్కువగా ఉండే జున్నును మాత్రమే తినండి. 
 

58

తయారుగా ఉన్న సూప్ లు

రుచిని పెంచడానికి, తొందరగా చెడిపోకుండా ఉండే రెడీ టు ఈట్ ఫుడ్ లను ఎక్కువగా తయారుచేస్తున్నారు. తయారుగా ఉన్న సూప్ లల్లో  ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే మీ రక్తపోటు బాగా పెరుగుతుంది. 

68

eating-pickles

ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసాలు

ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, పులియబెట్టిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. హాట్ డాగ్స్, సాసేజ్లు, బేకన్, డెలి మాంసాలు వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో కూడా ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. కాబట్టి మీరు వీటిని ఎక్కువగా తినకూడదు. 

78
Image: Getty

బ్రెడ్ , కాల్చిన ఆహారాలు

కొన్ని బ్రెడ్ లు, కాల్చిన ఆహారాల్లో ముఖ్యంగా శుద్ధి చేసిన పిండితో తయారైన వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.  అందుకే వీటిని కొనేటప్పుడు వాటి లేబుళ్లను చెక్ చేయండి. 
 

88

మసాలా దినుసులు, సలాడ్ డ్రెస్సింగ్

సోయా సాస్, కెచప్, బార్బెక్యూ సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి మసాలా దినుసుల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తక్కువగా తినండి. లేదంటే ఉప్పు తక్కువగా ఉండే వాటిని తినండి. వెనిగర్, నిమ్మరసం,మూలికలను ఉపయోగించి మీరే సలాడ్ డ్రెస్సింగ్ ను తయారుచేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories