ఉదయం యోగా చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Published : Jun 04, 2023, 07:15 AM IST

యోగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం యోగా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

PREV
16
ఉదయం యోగా చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఉదయాన్నే యోగా సాధన చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.  యోగా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాల ముప్పును తప్పిస్తుంది. ఉదయం యోగా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

26

కండరాల దృఢత్వం

యోగా ఆసనాలు లేదా శరీరాన్ని సాగదీయడం వల్ల మీ కండరాలు, కీళ్లకు విశ్రాంతి కలుగుతుంది. కండరాలు బిగుతు కూడా వదిలిపోతుంది. అలాగే శరీరం అంతటా రక్తం సక్రమంగా ప్రసరించడానికి యోగా సహాయపడుతుంది. 

36

శ్వాసను సక్రమంగా ఉంచుతుంది

"ప్రాణాయామం" లేదా "శ్వాస వ్యాయామం" మీ శ్వాసను సక్రమంగా ఉంచుతుంది. ప్రాణాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికోసం గాలిని బాగా పీల్చుతూ బయటకు వదలాలి. ఈ యోగా మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా  ఉంచుతుంది. 

46

మీ కోసం కొన్ని క్షణాలు 

మీ కోసం కనీసం 10 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం మీ పనులను చేయడానికి అవసరమైన మానసిక ప్రశాంతతను అందిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

56

కెఫిన్ కు గుడ్ బై చెప్పండి

ఉదయం లేచిన వెంటనే మీ మనస్సు, శరీరం సమన్వయంగా ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది లేచిన వెంటనే కాఫీని తాగాలనుకుంటారు. కానీ కాఫీ ఆరోగ్యానికి మంచి కాదు. దీనికి బదులుగా ఉదయం లేచిన వెంటనే సూర్యనమస్కారాలను చేయండి. ఇది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. 
 

66

ఏకాగ్రతను పెంచుతుంది

ఉదయాన్నే యోగా సాధన చేయడం వల్ల మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది. మీ శ్వాసపై మీకు నియంత్రణ ఉన్నప్పుడు మీ మెదడు టన్నుల తాజా ఆక్సిజన్ ను అందుకుంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పనులకు కూడా మిమ్మల్ని సిద్దం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories