బరువు తగ్గడాన్ని పెంచుతుంది
ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను బర్న్ చేయగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి దీన్ని తొక్కండి.
అంతేకాదు ఈ సైకిల్ ను తొక్కడం వల్ల మీ కాలు కదలికలు మెరుగుపడతాయి. మీ కాళ్లలోని కండరాల సమూహాలు - క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్ అయ్యేలా చేస్తాయి.