మీరు బెల్లం తింటున్నారా అయితే ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకోండి?

First Published Dec 5, 2021, 2:27 PM IST

బెల్లం (Jaggery) అనేక ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి శరీర ఆరోగ్యానికి మేలుచేస్తుంది. చెరుకు నుండి తయారు చేసిన ఈ బెల్లంను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది సహజసిద్ధమైన తీపి కలిగి ఉండడంతో వంటల్లో వేసినప్పుడు చాలా రుచిని అందిస్తుంది.
 

స్వీట్ల తయారీలో చక్కెరకు (Sugar) బదులు బెల్లం ఉపయోగించడంతో శరీరానికి ఎటువంటి హాని కలగదు. భోజనం తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బెల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న బెల్లాన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ (Ayurvedic Medicine) లో కూడా వాడుతుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బెల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
 

శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది: మనం చేసుకునే ఆహారపదార్థాలలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ నాళము, ఊపిరితిత్తులు, కడుపు, పేగులలో వచ్చే సమస్యలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. అస్తమా (Asthma) వ్యక్తులకు శ్వాస పరంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అధిక మొత్తంలో తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి బెల్లం సహకరిస్తుంది. బెల్లంలో ఉండే ఖనిజలవణాలు జీర్ణక్రియకు సహకరించే ఎంజైముల పనితీరును మెరుగుపరచుటకు, ఎసిటిక్ యాసిడ్ (Acetic acid) ను నియంత్రించుటకు పనిచేస్తూ జీర్ణక్రియ వ్యవస్థను (Digestive system) తేలికగా పనిచేయుటకు సహకరిస్తుంది. భోజనం చేసిన తరువాత బెల్లం ముక్కను తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: బెల్లంలో అనేక ఖనిజాలు, పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని (Immunity) మెరుగుపరుస్తాయి. వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. రోజువారిలో ఒక చిన్న బెల్లం ముక్కలు పిల్లలకు తినిపించిన వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 
 

మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది: బెల్లం అధికమొత్తంలో ఫైబర్ (Fiber) ను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేసే ఏజెంట్గా ఉంటూ, శరీరం నుండి వ్యర్ధాన్ని, అవాంఛిత కణాలను బయటకు పంపించే సామర్థ్యాన్ని కలిగి మలబద్ధకం సమస్యను (Constipation problem) తగ్గిస్తుంది. పేగుల కదలికలను ఉత్తేజపరచడానికి సహాయపడి మలబద్దకపు సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

బెల్లంతో స్త్రీలకు కలిగే ప్రయోజనాలు: ఇది స్త్రీలలో అనేమియా సమస్యలను (Anemia problems) నిర్వహించుటకు, రుతు సమస్యలను (Menstrual problems) నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో స్త్రీలు బెల్లాన్ని తీసుకుంటే రక్తకణాల స్థాయిని పెంచడానికి చక్కగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఒక స్పూన్ బెల్లంను మహిళలు తీసుకుంటే తగిన ఫలితం ఉంటుంది.
 

బెల్లంతో మగవారికి కలిగే ప్రయోజనాలు: బెల్లాన్ని రోజు మగవారు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. ముఖ్యంగా మగవారిలో నాణ్యమైన శుక్రకణాల (Sperm) స్థాయిని బాగా పెంచుటకు బెల్లం చక్కగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడుతుంది.
 

హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది: బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తానికి సంబంధించిన వివిధ రకాల వ్యాధులను తగ్గించే హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతాన్ని పెంచుతుంది. బెల్లం రోగనిరోధక శక్తిని (Immunity) కూడా మెరుగుపరుస్తుంది. బెల్లంను రోజు తీసుకోవడంతో మంచి ఫలితం కలుగుతుంది.

click me!