చెడు కొలిస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published May 27, 2024, 2:53 PM IST

చెడు కొలిస్ట్రాల్ మన శరీరంలో పెరిగిపోతే.. అది గుండె ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు.  హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు  ఎక్కువగా వస్తూ ఉంటాయి. 

ప్రతి ఒక్కరి శరీరంలో కొలిస్ట్రాల్  ఉంటుంది. వాటిలోనూ రెండు రకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొలిస్ట్రాల్ తో పాటు.... బ్యాడ్ కొలిస్ట్రాల్ కూడా ఉంటుంది. గుడ్ కొలిస్ట్రాల్ శరీరంలో ఉండటం ఎంత ముఖ్యమో.. బ్యాడ్ కొలిస్ట్రాల్ ఉండకపోవడం కూడా అంతే ముఖ్యం. మరి.. ఈ చెడు కొలిస్ట్రాల్ ని సులభంగా కరిగించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

cholesterol

చెడు కొలిస్ట్రాల్ మన శరీరంలో పెరిగిపోతే.. అది గుండె ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు.  హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు  ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే.. మనం రోజువారి చేసే కొన్ని పనుల ద్వారా.. సులభంగా దీనికి తగ్గించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మనం రోజువారి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలిస్ట్రాల్ ని కరిగించవచ్చట. ఓట్ మీల్, బీన్స్, పప్పు, యాపిల్స్, పీర్స్ వంటి ఫుడ్స్ ని డైట్ లో భాగం చేసుకుంటే...  దాదాపు 5 నుంచి 10 శాతం బ్యాడ్ ఫ్యాట్ కరిగిపోతుందట.
 

FAT

ఇక.. చెడు కొలిస్ట్రాల్ ని తరిమికొట్టేందుకు.. గుడ్ ప్యాట్స్ ని డైట్ లో భాగం చేసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్ కి బదులుగా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. రెడ్ మీట్, ఫుల్ ఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వాటిని మానేసి.. వాటికి బదులు ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ తీసుకోవాలి. వీటిలో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్  ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కానీ.. వెల్లుల్లిలో... చెడు కొలిస్ట్రాల్ ని కరిగించే ప్రాపర్టీలు చాలానే ఉన్నాయి. రెగ్యులర్ గా  వెల్లుల్లిని డైట్ లో భాగం  చేసుకుంటే దాదాపు 10 శాతం చెడు కొలిస్ట్రాల్ కరిగిపోతుందట. ఫుడ్ లో భాగం చేసి అయినా వెల్లుల్లి తీసుకోవచ్చు.

cinamon


బ్లడ్ లోని లిపిడ్ లెవల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. మీరు దాల్చిన చెక్క పొడిని.. పెరుగు, ఓట్ మీల్, కాఫీ లాంటి వాటిల్లో జత చేసి అయినా తీసుకోవచ్చు.

ఇక వీటితో... మనం శారీరకంగా శ్రమించడం వల్ల కూడా చెడు కొలిస్ట్రాల్ ని కరిగించవచ్చు. ఈ ఫుడ్ లో మార్పులు చేసుకుంటూనే.. వారానికి ఐదు రోజులు రోజుకి 30 నిమిషాల పాటు  వ్యాయామం చేయడం, వాకింగ్, సైక్లింగ్ లాంటివి చేయడం వల్ల... కొలిస్ట్రాల్ ని సులభంగా మేనేజ్ చేయవచ్చు.
 


ఇక మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలి. కనిపించిన ప్రతి ఫుడ్ తినేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం కడుపు నిండా తీసుకోవాలి. అప్పుడు.. జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన రాదు. ఫలితంగా సులభంగా చెడు కొలిస్ట్రాల్ శరీరంలో చేరడాన్ని ఆపవచ్చు.
 

click me!