అరికాళ్లలో మంట ఎందుకొస్తుంది? అది తగ్గాలంటే ఏం చేయాలి?

First Published | May 26, 2024, 4:26 PM IST

చాలా మందికి అరికాళ్లలో మంటగా, చికాకుగా ఉంటుందని చెప్తుంటారు. నిజానికి అరికాళ్లలో మంట రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటి? దీన్ని తగ్గించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కొన్ని కొన్ని సార్లు పాదాల అరికాళ్లలో మంటగా అనిపిస్తుంటుంది. అలాగే అరికాళ్లలో వెచ్చదనం, తిమ్మిరి, జలదరింపు వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రిపూటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు అరికాళ్లలో మంటగా ఎందుకు అనిపిస్తుంది? దీన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

డయాబెటిక్ న్యూరోపతి

డయాబెటీస్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ..అది రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల సిగ్నల్స్ రావడానికి బదులుగా అరికాళ్లలో జలదరింపు వస్తుంది. 

Latest Videos


విటమిన్ బి లోపం

పాదాల్లో మంటకు ఒక కారణం అవసరమైన పోషకాల లోపం. అవును ప్రస్తుత కాలంలో చాలా మంది విటమిన్ బి 12, విటమిన్ బి 6, విటమిన్ బి 9 అంటే ఫోలేట్ లోపంతో బాధపడుతున్నారు. ఈ విటమిన్ల లోపం వల్ల అరికాళ్లలో చికాకు కలుగుతుంది. ఇది పాదాలు, కండరాల మధ్య సమన్వయ లోపానికి దారితీస్తుంది. 

రక్తహీనత

మగవారితో పోలిస్తే ఆడవారికే రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గితే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య విటమిన్ బి లోపం వల్ల వస్తుంది. రక్తహీనత వల్ల బలహీనత, బద్ధకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇవి విటమిన్ బి లోపానికి సంకేతాలు.

హైపోథైరాయిడ్

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల నరాలు దెబ్బతింటాయి. 2016 అధ్యయనం ప్రకారం.. థైరాయిడ్ గ్రంథి చురుకుగా లేకపోవడం వల్ల పాదాలలో మంట సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మూత్రపిండాల వ్యాధి

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు రక్తంలో టాక్సిన్స్ ఏర్పడుతుంటాయి. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో పెరిఫెరల్ న్యూరోపతి ఒకటి. దీనివల్ల పాదాలలో చికాకు కలుగుతుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో పది శాతం కంటే ఎక్కువ మందికి కాలు దిగువ భాగంలో వాపు, మంట, చికాకు కలుగుతాయి. 
 

click me!