తలలో పేలు వేధిస్తున్నాయా.. వాటి బాధ తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి!

Published : Jul 08, 2022, 03:30 PM IST

తలలో పేలు సమస్య (Head lice Problem) బడికి వెళ్లే పిల్లలలో అధికంగా ఉంటుంది. ఈ పేలు వల్ల నలుగురిలోకి వెళ్లాలంటేనే ఇబ్బంది.   

PREV
17
తలలో పేలు వేధిస్తున్నాయా.. వాటి బాధ తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి!

తలలో పేలు కొరకడంతో అక్కడి చర్మం ఎర్రగా మారి అలర్జీ, దురద, మంట, చికాకు, అసౌకర్యం వంటి సమస్యలు కలుగుతాయి. తలలో పేలు గుడ్లు ఎక్కువగా పెట్టినప్పుడు అవి ఇతరులకు చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. మరి ఈ సమస్యను తగ్గించుకోవడానికి పాటించవలసిన నివారణ చిట్కాల (Prevention tips) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

పేలు ఒకరి తలలో నుంచి మరొకరి తలలోకి  వ్యాపిస్తాయి. కానీ ఈ పేలు కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి అనేది వ్యాపించదు. ఇవి రక్తాన్ని తాగి జీవించే అతి చిన్న జీవులు. ఇవి కుట్టినప్పుడు విపరీతమైన దురద కలుగుతుంది. దీంతో తల గిరుక్కోవడం చేస్తుంటారు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఇబ్బందిగా (Embarrassingly) ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్ లో అనేక రసాయన షాంపూలు (Chemical shampoos) అందుబాటులో ఉన్నాయి.
 

37

కానీ వీటి వాడకంలో ఉపయోగించే అధిక మొత్తంలోని రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి జుట్టు రాలడాన్ని (Hair loss) అధికం చేస్తాయి. కనుక పేలును సహజ సిద్ధమైన పద్ధతిలో (Natural preparation method) తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ఇంటిలోనే తక్కువ ఖర్చుతో కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తే పేలు సమస్య తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
 

47

వేప నూనె: పేలు నివారణకు చక్కటి పరిష్కారం వేప నూనె (Neem oil). వేప నూనె ఘాటైన సువాసనను (Strong aroma), చేదును కలిగి ఉంటుంది. ఈ నూనెను తలకు అప్లై చేసుకుంటే పదిహేను నిమిషాల్లోనే పేలు, గుడ్డు చచ్చిపోతాయి. కనుక వేప నూనెను అప్లై చేసుకోండి.. పేలు సమస్య నుండి ఉపశమనం పొందండి.
 

57

కుంకుడు రసం: పేలు సమస్యలను తగ్గించుకోవడానికి రసాయన షాంపూల వాడకాన్ని తగ్గించి కుంకుడు రసాన్ని (Soap nuts) ఉపయోగించడం మంచిది. దీంతో పేలు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం (Hair health) కూడా మెరుగుపడుతుంది.
 

67

పటిక బెల్లం: ఒక గ్లాసు వాటర్ (Water) లో పటిక బెల్లాన్ని (Alum jaggery) వేసి కలుపుకొని ఆ నీటిని తలకు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు వాడితే పేలు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.  కనుక ఈ చిట్కాను ప్రయత్నించండి.. పేలు సమస్య నుంచి ఉపశమనాన్ని పొందండి.
 

77

ఆలీవ్ నూనె బేకింగ్ సోడా: బేకింగ్ సోడాకు (Baking soda) ఆలివ్ నూనెను (Olive oil) కలుపుకొని ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకు అప్లై చేసుకుని అలానే పడుకోవాలి. ఉదయం తలస్నానం చేయాలి. ఇలా పది రోజులపాటు క్రమంగా చేస్తే పేలు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఈ చిట్కా పేలు సమస్యను తగ్గించడానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది.

click me!

Recommended Stories