చాలామంది తీపి ప్రియులు పాయసం తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు వెరైటీగా మనం సగ్గుబియ్యం పైనాపిల్ పాయసం (Saggubiyyam Pineapple payasam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
తక్కువ పదార్థాలతో (Less Ingredients) చేసుకొనే ఈ పాయసం చాలా రుచిగా (Delicious) ఉంటుంది. ఈ పాయసం తయారీలో ఉపయోగించే సగ్గుబియ్యం, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తినిచ్చే మంచి హెల్తీ పదార్థాలు. పిల్లలు ఏ పేచీ లేకుండా ఈ పాయసాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇదొక మంచి హెల్తీ స్వీట్ ఐటమ్స్.
27
Saggubiyyam Pineapple payasam
కావలసిన పదార్థాలు: ఒక కప్పు పైనాపిల్ ముక్కలు (Pineapple slices), ఒక కప్పు సగ్గుబియ్యం (Stuffed), సగం లీటర్ పాలు (Milk), ముప్పావు కప్పు చక్కెర (sugar), రెండు టేబుల్ స్పూన్ ల డ్రైఫ్రూట్స్ (Dried fruits) పలుకులు, ఒక స్పూన్ నెయ్యి (Ghee).
37
Saggubiyyam Pineapple payasam
తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం (Soaked stuffing), రెండు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well). సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
47
Saggubiyyam Pineapple payasam
మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలను వేసి బాగా మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. తర్వాత అందులో సగం కప్పు చక్కెర, కొన్ని పాలు పోసి ఉడికించుకోవాలి.
57
Saggubiyyam Pineapple payasam
అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కగా (Thickened) అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరల కడాయి పెట్టి మిగిలిన పాలు, ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం, మిగిలిన చక్కెర వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మధ్య మధ్యలో కలుపుతూండాలి.
67
Saggubiyyam Pineapple payasam
పాయసం చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక ముందుగా తయారు చేసుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాయసం గార్నిష్ (Garnish) కోసం నెయ్యిలో డ్రైఫ్రూట్స్ ను వేయించి పాయసం మీద తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ (Ready).
77
Saggubiyyam Pineapple payasam
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు వెరైటీ (Variety) పాయసాలను ట్రై చేసి పిల్లలకు ఇస్తే వారు తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి శక్తిని ఇచ్చే మంచి హెల్తీ పాయసం (Healthy pudding).