అలసట, హెయిర్ ఫాల్, డిప్రెషన్ తో బాధపడుతున్నారా? అయితే మీకు ఈ టెస్ట్ అవసరం..

Published : Apr 25, 2023, 03:04 PM IST

ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా.. ఎన్నో రోగాల ముప్పు తప్పాలన్నా విటమిన్ డి చాలా చాలా అవసరం.   

PREV
19
అలసట, హెయిర్ ఫాల్, డిప్రెషన్ తో బాధపడుతున్నారా? అయితే మీకు ఈ టెస్ట్ అవసరం..

ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు ఎన్నో కారణాలున్నాయి. అందులో విటమిన్ల లోపం కూడా ఉందంటున్నారు నిపుణులు. అవును డిప్రెషన్ తో పాటుగా జుట్టు రాలడం, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే మీకు డి విటమిన్ లోపమున్నట్టేనంటున్నారు నిపుణులు. ఇది అంత ప్రమాదకరమైన సమస్య ఏం కాదుగా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ విటమిన్ డి లోపం ఎన్నో ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. 

29
vitamin d deficiency

ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కొన్ని వ్యాధులను నివారించడానికి మన శరీరానికి తగినంత విటమిన్ డి అవసరం. అయితే చాలా మంది ఈ విటమిన్ డి లోపాన్ని గుర్తించరు. ఈ విటమిన్ మనలో ఎక్కువగా లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

39

ఎముకల నొప్పి

మన శరీరంలో విటమిన్ -డి తక్కువగా ఉన్నప్పుడు ఎముకలో నొప్పి కలుగుతుంది. అలాగే అలసటగా ఉంటుంది. అయితే అన్ని రకాల శరీర నొప్పులకు ఇదే కారణం అయ్యి ఉండదు. ఇతర కారణాల వల్ల కూడా ఒంటి నొప్పులు వస్తాయి. ఇందుకోసం టెస్టులు చేయించుకోవడం అవసరం.
 

49

అలసట, డిప్రెషన్

విటమిన్-డి లోపం వల్ల అలసటకు దారితీస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా.. ఇది నిరాశకు కూడా దారితీస్తుంది. అందుకే మీరు అలసట, నిరాశ వంటి సమస్యలతో బాధపడుతుంటే విటమిన్-డి పరీక్ష చేయించుకోండి. ఆకలి లేకపోవడం కూడా ఈ విటమిన్ లోపమే కారణం కావొచ్చు. 

59

జుట్టు రాలడం

ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విటమిన్ డి లోపం దీనికి ఒక కారణమేనంటున్నారు నిపుణులు. అందుకే జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే విటమిన్-డి పరీక్ష తప్పక చేయించుకోండి. 
 

69

వరుస ఇన్ఫెక్షన్లు

మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ డి చాలా అవసరమని అందరికీ తెలుసు. అయితే మీ శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇది విటమిన్ డి లోపాన్ని కూడా సూచిస్తుంది.
 

79

నిద్రలేకపోవడం

కంటినిండా నిద్ర లేకపోవడం, నిద్రలేమి, రాత్రిళ్లు తరచుగా మేల్కొనడం మొదలైనవి విటమిన్ డి లోపంతో కూడా వస్తాయి. నిద్ర సమస్యలు సాధారణం అయినప్పటికీ. ఎందుకంటే ఇది విటమిన్ డి లోపానికి సంకేతం కాబట్టి.
 

89

చర్మం రంగుమారడం

మీ శరీరంలో విటమిన్-డి తక్కువైనప్పుడు అది చర్మం ద్వారా కూడా కనిపిస్తుంది. అంటే మీకు విటమిన్ డి లోపం ఉంటే మీ చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది విటమిన్-డి లోపాన్ని సూచించే లక్షణం.

99

చిగుళ్లు, దంతాల సమస్యలు

విటమిన్-డి లోపం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటప్పుడు విటమిన్ డి టెస్టు చేయించుకోవాలి. 

click me!

Recommended Stories