మీకు తెలుసా? ఉప్పు ఉప్పు క్యాన్సర్ కు కూడా కారణమవుతుందట. రోజూ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక జపనీస్ అధ్యయనం వెల్లడించింది. దీనిని మరింత అర్థం చేసుకోవడానికి ఇటీవల ఎలుకలపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కడుపులో ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల కడుపు పొర మారుతుంది. అలాగే ఇధి క్యాన్సర్ కు కారణమవుతుంది. దీనిని అనుసరించి జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ నుండి వచ్చిన అనేక అధ్యయనాలు ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిర్ధారించాయి.