ముక్కులో వేలు పెట్టుకున్నారో.. ఈ రోగం రావడం గ్యారంటీ..

First Published | Feb 8, 2024, 2:53 PM IST

ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఎక్కువగా పిల్లలకే ఉంటుంది. కానీ ముక్కులో వేలు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం.. ముక్కులో వేలు పెట్టే అలవాటు వల్ల ప్రమాదకరమైన వ్యాధి బారిన పడతారు.

అల్జీమర్స్ వ్యాధిలో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒక రకమైన చిత్తవైకల్యం. రానురాను ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వాటినే మర్చిపోతాడు. వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థాయికి చేరుకుంటాడు. అయితే పెద్ద వయసు వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అలవాట్ల వల్ల ఈ వ్యాధి చిన్న వయసు వారికి కూడా రావొచ్చంటున్నారు పరిశోధకులు.
 

అధ్యయనంలో ఏం కనుగొన్నారు?

ఒక అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్ ప్రమాదాన్ని బాగా పెంచే ఒక అలవాటు ఉద్భవించింది. అదే ముక్కులో వేలు పెట్టే అలవాటు. ముక్కులో వేలు పెట్టడం వల్ల కొన్ని వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల అల్జీమర్స్ ముప్పు బాగా పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధికారకాలు అమిలాయిడ్ బీటా ప్రోటీన్ ఏర్పడటానికి కారణమవుతాయి. ఇది అల్జీమర్స్ కు కారణమయ్యే కారకాలలో ఒకటి.
 


Image: Getty

దీనికి కారణమేంటి? 

నిజానికి ముక్కులో వేలు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు నాసికా కణజాలానికి సోకుతాయి. దీని వల్ల ఈ వ్యాధికారకాలు మెదడుకు చేరుకుని న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు కారణమవుతాయి. ఘ్రాణ వ్యవస్థ సహాయంతో ఏ సూక్ష్మక్రిమి అయినా సులభంగా మెదడుకు చేరుతుంది. నాసికా కుహరంలో ఉన్న ఘ్రాణ నాడి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. దీని వల్ల ఈ వ్యాధికారకాలు మెదడుకు చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఈ వ్యాధికారకాలు మెదడుకు చేరిన వెంటనే అమిలాయిడ్ బీటా ప్రోటీన్ ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్లేగుగా మారి అల్జీమర్స్ కు కారణమవుతుంది.
 

ముక్కులో వేలు పెట్టే సాధారణ అలవాటు కూడా అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు దారితీస్తుందని, దీని వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుందని, భాషా సంబంధిత సమస్యలు వస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. అందుకే ముక్కులో వేలు పెట్టే అలవాటును మానుకోవాలి. 
 

ముక్కును ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? 

ముక్కును శుభ్రంగా ఉంచుకోవడానికి సెలైన్ స్ప్రే వాడండి. దీని సహాయంతో ముక్కులో పేరుకుపోయిన దుమ్ము, శ్లేష్మం వంటివి సులభంగా తొలగిపోతాయి. 

ముక్కులో వేలు పెట్టడానికి బదులుగా శుభ్రమైన చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ సహాయంతో ముక్కును శుభ్రం చేయండి.
 

Latest Videos

click me!