పాలు మంచి పోషకాహారం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న ముచ్చట అందరికీ తెలిసిందే. పాలలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ సి వంటి రకరకాల విటమిన్లు మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఎన్నో రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలను తాగిస్తుంటారు. ఇకపోతే పెద్దవయసు వారు కూడా రాత్రి పూట ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగుతుంటారు.