కడుపు నొప్పి, గ్యాస్ సమస్యే అని లైట్ తీసుకుంటే గుండెపోటు రావొచ్చు.. సేఫ్ గా ఉండాలంటే..?

Published : Apr 26, 2023, 02:28 PM IST

గుండెపోటుకు ఎన్నో కారణాలున్నాయి. చిన్న వయసు వారికి కూడా ఇది వస్తోంది. అయితే గుండెపోటు వచ్చే ముందు ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వీటిని లైట్ తీసుకుంటే ప్రాణాలు కూడా పోవచ్చు.   

PREV
17
కడుపు నొప్పి, గ్యాస్ సమస్యే అని లైట్ తీసుకుంటే గుండెపోటు రావొచ్చు.. సేఫ్ గా ఉండాలంటే..?
Image: Getty

ఈ రోజుల్లో కడుపు నొప్పి సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. చాలా మంది కడుపునొప్పితో తరచుగా బాధపడుతుంటారు కూడా. ఈ కడుపు నొప్పికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అందుకే చాలా మంది కడుపు నొప్పిని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఇది కేవలం జీర్ణ సమస్య అని, దానంతట అదే తగ్గిపోతుందని భావిస్తుంటారు. దీనివల్లే అజీర్ణం, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ దేశంలో ప్రతి 100 మందిలో 99 మందిని ప్రభావితం చేస్తున్నాయి.

27

చిన్న గ్యాస్ సమస్య కూడా గుండెపోటును ప్రేరేపిస్తుంది. మలబద్ధకం పెద్దప్రేగు క్యాన్సర్, క్షయ వ్యాధికి కారణమవుతుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. ఈ సమస్యలను నివారించడానికి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. అలాగే అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా పోషకాహారాన్నే తినాలి. తీపి లేదా వేయించిన ఆహారాన్ని మితంగా తినాలి. మరీ ముఖ్యంగా యోగా, ఇతర వ్యాయామాలను రెగ్యులర్ గా  చేయండి. 

37
Image: Getty

అజీర్ణం ఒక సాధారణ సమస్యగా అనిపించొచ్చు. దీనిని తగ్గించుకోకపోతే ఇది తీవ్రమైన రోగాలకు, గుండెపోటుకు దారితీస్తుంది. అంతేకాదు  ఇది అల్సర్లు, ఐబిఎస్, పెద్దప్రేగు శోథ, మధుమేహం, దీర్ఘకాలిక మలబద్ధకం వంటి ప్రాణాంతక పరిస్థితులుగా అభివృద్ధి చెందుతుంది.
 

47

పేగు ఆరోగ్యానికి చురుకుగా ఉండటం చాలా అవసరం. గ్యాస్ సమస్య వల్ల ఛాతిలో నొప్పి పుడుతుంది. అయితే ప్రతిరోజూ వ్యాయామం చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడొచ్చు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగా వంటి వ్యాయామాను చేసినా ఈ సమస్యల నుంచి దూరంగా ఉంటారు. వ్యాయామాలు గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. 

57
Image: Getty

అపానవాయువుతో సహా అనేక సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ తగినంత నీటీని తాగండి. జీర్ణవ్యవస్థ ద్వారా అదనపు వాయువును తొలగించడానికి వాటర్ సహాయపడుతుంది, నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది కూడా. మూలికా పానీయాలు లేదా గోరువెచ్చని నీరు కూడా ఈ రెండు సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నీరు, అజ్వైన్ నీరు, దోసకాయ జ్యూస్ ను తాగినా ఈ సమస్యలను తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. 

67
Image: Getty

గ్యాస్ తో పాటుగా ఛాతి నొప్పి కలిగితే  గ్లూటెన్, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకండి. అలాగే, కార్బోనేటేడ్ పానీయాలు, సోడాలను కూడా తాగకండి. ఎందుకంటే ఇవి కడుపులో వాయువు ఏర్పడటానికి ప్రేరేపిస్తాయి.

77
Image: Getty

అపానవాయువు వంటి జీర్ణ సమస్యలకు అల్లం మరొక సహజ చికిత్స. మీరు అల్లం టీ తాగితే, మీరు తేడాను గమనించవచ్చు. దాని శోథ నిరోధక ప్రభావాలు గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తాయి. దీన్ని సూప్లు, సబ్జీ, కూరల్లో చేర్చుకుని తినవచ్చు. వెంటనే మంచి అనుభూతిని పొందడానికి ఉత్తమ మార్గం అల్లం టీని సిప్ చేయడం.

click me!

Recommended Stories