HealthTips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ రెమెడీస్ తో ట్రై చేయండి?

Published : Jul 15, 2023, 10:55 AM IST

HealthTips: తరచుగా ఇబ్బంది పెట్టే సమస్యలలో నోటిపూత ఒకటి. సమస్య చిన్నదిగా కనిపిస్తుంది కానీ అది పెట్టే బాధ భరించలేనిది. అందుకే నోటిపూతని నేచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.  

PREV
16
HealthTips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ రెమెడీస్ తో ట్రై చేయండి?

 సాధారణంగా నోటి పూత నోటి చర్మం దద్దుర్లు, బ్యాక్టీరియా, మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల వస్తుంది. లేదంటే ప్రమాదవశాత్తు చెంప లోపల భాగాన్ని కొరికేయడం వల్ల కూడా వస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడకపోవటం వలన హార్మోన్ల అసమతుల్యత వలన విటమిన్ ఐరన్ లోపాల వలన కూడా నోటి పూత రావచ్చు.
 

26

నోటి పూత లేకపోతే నోటి పుండు అనేది ప్లాస్మా పోర అని పిలవబడే నోటి లోపలి భాగంలో ఉండే సున్నితమైన కణజాలం యొక్క భాగాన్ని కోల్పోవడం. నోటిపూతకి గురైన వారు తినటానికి చాలా చాలా ఇబ్బంది పడతారు ఏమి తిన్నా కారంగా నోరంతా మంటగా అనిపిస్తుంది.

36

అయితే  తేనెని నోటిపూతపై పోయటం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. తేనె, పసుపు కలిపి నోటి పూత వచ్చిన ప్లేస్ లో పెడితే కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే బియ్యం కడిగిన నీళ్ళలో కటికి బెల్లాన్ని కలిపి తీసుకుంటే నోటిపూత సమస్యను నివారించవచ్చు.

46

 కొత్తిమీర కషాయాన్ని తయారుచేసుకొని నోట్లో పోసుకొని కాసేపు పుక్కిలిస్తే నోటిపూత నుంచి ఉపశమనం దొరుకుతుంది. అలాగే తమలపాకులని నమిలి తినటం వల్ల, తులసాకులను తినటం వల్ల కూడా నోటి సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్లిజరిన్ ని నోటి పూత పై పోయటం వలన కూడా ఉపశమనం లభిస్తుంది.
 

56
mouth ulcers

mouth ulcersనోటి పూతతో బాధపడేవారు కారానికి సంబంధించిన ఆహారం తీసుకోకుండా పండ్లు ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది. నెయ్యి తినడం వల్ల, నోటిపూతపై రాయడం వలన కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది.

66
mouth ulcer

ఈ సమయంలో మాంసాహారాన్ని దూరంగా ఉంచడం చాలా మంచిది. సాధారణంగా నోటిపూత 10 నుంచి 15 రోజుల లోపల తగ్గిపోతుంది అలా కాని పక్షంలో వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఎందుకంటే దీర్ఘకాలం నోటి పూత కానీ నోటి కురుపులు కానీ నోటికి ఆన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి.

click me!

Recommended Stories