పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే..!

Published : Jul 15, 2023, 07:15 AM IST

కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్, పిక్రోక్రోసిన్ తో సహా బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.   

PREV
16
పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే..!
saffron tea

కుంకుమపువ్వును ఇష్టపడని వారు అసలే ఉండరు. కుంకుమ పువ్వు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ మసాలా దినుసును ఎక్కువగా గర్బిణులు మాత్రమే ఉపయోగిస్తారు. నిజానికి దీన్ని అందరూ తీసుకోవచ్చు. ఇది అందరికీ మంచి మేలు చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో ఒకటి లేదా రెండు చిటికెడు కుంకుమపువ్వును చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.. 

26
saffron tea

కుంకుమ పువ్వు రుచికరంగా ఉంటుంది. తీయగా, టేస్టీగా ఉండే కుంకుమ పువ్వును ఎన్నో వంటల్లో ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. 

36
saffron tea

కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్, పిక్రోక్రోసిన్ తో పాటుగా బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ సమ్మేళనాలు నిరాశ, నిస్పృహ లక్షణాలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. 

46

2020 లో జర్నల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో ప్రచురించబడిన అధ్యయనం.. కుంకుమ పువ్వు యాంటీ డిప్రెసెంట్ ప్రభావాన్ని కలిగి ఉందని తేల్చింది. ఆందోళన, నిద్రలేమి,  నిస్పృహ లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు నివేదించాయి.

56

కుంకుమపువ్వులో ఎన్నో రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పరిశోధన ప్రకారం.. కుంకుమపువ్వులో ఉండే సఫ్రానల్ అనే సమ్మేళనం మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.
 

66

కుంకుమపువ్వు తలనొప్పి, నొప్పి, ఆందోళన వంటి పీఎంఎస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పాలలో కుంకుమపువ్వును కలిపి తాగడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories