Health Tips: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆహారం ద్వారా సమస్యకి చెక్ పెట్టండి?

Published : Aug 12, 2023, 12:50 PM IST

Health Tips: థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యని అదుపులో ఉంచవచ్చు అది ఎలాగో చూద్దాం.   

PREV
16
Health Tips: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆహారం ద్వారా సమస్యకి చెక్ పెట్టండి?

ప్రస్తుతం ప్రతి పది మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లే స్త్రీలు ఒత్తిడికి గురవుతారు. దాంతో పాటు రుతుచక్రం, గర్భధారణ వంటి కారణాల వల్ల కూడా వారిలో హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఉండడం. 

26

మన ఆహార అలవాట్లలో సరైన మార్పులు చేసుకుని మందులు సరిగ్గా తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. మధ్య వయసు వచ్చిన తర్వాత బీపీ, డయాబెటిస్‌లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో ఇరవైలలోనే థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. హైపో థైరాయిడిజమ్‌ అనేది అనారోగ్యం కాదు.
 

36

 థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ (టీఎస్‌హెచ్‌) దేహానికి తగినంతగా అందని స్థితి. అలాగే హైపర్‌ థైరాయిడిజమ్‌ అంటే ఆ హార్మోన్‌ అవసరానికి మించి అందడం అన్నమాట. హైపో థైరాయిడిజమ్‌ విషయానికి వస్తే ఇది మగవాళ్లలో కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటోంది. ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణమే. 
 

46

అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి మందులతో పాటు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం. హైపో థైరాయిడిజమ్‌ నుంచి బయటపడడానికి అయోడిన్‌ అనే ఖనిజం చాలా అవసరం. ఈ ఖనిజం సహజంగా అందే ఆహారం తినదగిన (పఫర్‌ ఫిష్‌ వంటి విషపూరితం కాని)అన్ని రకాల చేపలు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు.

56

 వీటిలో అయోడిన్‌ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది. అలాగే సెలీనియం బ్రెజిల్‌ నట్స్‌ (డ్రై ఫ్రూట్స్‌ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి. రోజూ ఒక స్పూన్‌ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. 

66

వెజ్‌ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి.పండ్ల విషయానికి వస్తే  స్ట్రాబెర్రీ, పీచ్‌ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలి. ఇక ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చు. తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలి

click me!

Recommended Stories