మీకు తెలుసా? పెద్దప్రేగు క్యాన్సర్ లో మన జీవనశైలి కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి మూడేళ్లకోసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, ఆల్కహాల్, స్మోకింగ్, అనారోగ్యకరమైన జీవనశైలి, అసమతుల్య ఆహారం పెద్దప్రేగు క్యాన్సర్ పెరుగుదలకు దోహదం చేసే ఇతర ప్రమాద కారకాలు. సమతుల్య ఆహారాన్ని తినడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించడం, రెడ్ మీట్ ను తినడం తగ్గించడం, ఆల్కహాల్ ను నివారించడం వంటి అలవాట్ల వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.