చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు బాగా పెరుగుతాయి. నిజానికి వాతావరణంలో మార్పుల వల్ల వృద్ధులతో పాటుగా యువకుల్లో కూడా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో బీపీ పెరిగి శరీరంలోని కండరాలు కూడా సరిగా పనిచేయవు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతానికి దారితీస్తుంది. అందులోనూ చలికాలంలో చాలా మంది ఇతర సీజన్ల కంటే నీళ్లను చాలా తక్కువగా తాగుతారు. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మీ రక్తం మందంగా మారుతుంది. ఇది హైబీపీ, డయాబెటిస్ పేషెంట్లకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.
బ్రెయిన్ స్ట్రోక్ రకాలు
బ్రెయిన్ స్ట్రోక్ లో రెండు రకాలు ఉన్నాయి. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్ కు కారణమవుతుంది. అలాగే మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో ఈ చలికాలంలో మీరు ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడుతున్నట్టైతే ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త కూడా మీ జీవితాన్ని ఎంతో దెబ్బతీస్తుంది.
stroke symptoms
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు
చేతులు, కాళ్ల కదలికలో ఇబ్బంది
ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం
సరిగా మాట్లాడలేకపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తలనొప్పి, వాంతులు
వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
- మీరు ఉదయం లేవగానే ఖచ్చితగా కాసేపు వ్యాయామం చేయండి. ఒకవేళ మీ చుట్టుపక్కల కాలుష్యం ఉంటే ఆరుబయట కాకుండా ఇంట్లోనే వ్యాయామం చేయంది.
- మీకు రక్తపోటు ఎక్కువగా ఉంటే ఉదయం నడక మానుకోండి.
- బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులను ధరించండి. సాక్స్ నుంచి గ్లౌజులు, టోపీల వరకు శరీరాన్ని బాగా కప్పి ఉంచాలి.
- మీరు తినే ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేస్తే మీ రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటుంది.
- ఎక్కువగా వేయించిన, జంక్, మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి.
- డయాబెటీస్ ను, అధిక రక్తపోటును రెగ్యులర్ గా చెక్ చేయండి.